బాబుకు దిమ్మ‌తిరిగే క‌థ చెప్పిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan comments on chandrababu
Updated:  2018-03-25 13:01:57

బాబుకు దిమ్మ‌తిరిగే క‌థ చెప్పిన జ‌గ‌న్

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్..ఈ యాత్ర టీడీపీ నాయ‌కుల కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో కొన‌సాగుతోంది...పేరుకు మాత్ర‌మే అధికారపార్టీ  నాయ‌కుల‌కు కంచుకోట అయినా జ‌గ‌న్ అక్క‌డ అడుగుపెట్ట‌డంతో ప‌రిస్థితి తారుమారు అయింద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.
 
అయితే తాజాగా జ‌గ‌న్ సంక‌ల్పయాత్ర‌లో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు సూట‌య్యే విధంగా ఓ కథ చెప్పారు... ఒక ఊళ్లో ఓ వ్య‌క్తి త‌రుచుగా చిన్న చిన్న వ‌స్తువులును దొంగ‌తనం చేస్తుండేవాడ‌ట‌... అలా చేస్తూ చేస్తూ కొంత కాలానికి  దొంగ‌తనం వృత్తిపై ఆ వ్య‌క్తికి పూర్తి అవ‌గాహ‌న రావ‌డంతో మెల్ల‌గా పెద్ద పెద్ద వ‌స్తువుల‌ను దొంగ‌తనం చేసే స్థాయికి చేరుకున్నాడు... అయితే త‌మ గ్రామంలో దొంగ‌త‌నాలు ఎక్కువ అవుతున్నాయ‌ని భావించి అత‌నిని గ్రామ‌స్తులు కాపు కాసి పట్టుకున్నారు.
 
అప్పుడు ఆ వ్యక్తి తెలివిగా గ్రామ‌స్తుల‌కు ఒక విషయం చెప్పుకొస్తాడు .అదేంటంటే తనను పోలీసులకు అప్పగిస్తే ఊరు మొత్తం పరువే పోతుందని చెప్పాడు. దీంతో అత‌ని విష‌యం తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. చేసింది దొంగతనం పైగా పట్టుకుంటే ఊరు పరువు పోతుందని అంటావా  అంటూ గ్రామస్తులు అత‌నిపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.
 
ఈ క‌థ‌లో త‌ప్పు ఎవ‌రిది అని జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను అడిగితే  వారంద‌రు దొంగ‌దేన‌ని జ‌వాబు ఇచ్చారు... అయితే ఏపీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా విచ్చ‌ల‌విడిగా ప్ర‌జ‌ల సొమ్మును విదేశాల‌కు త‌ర‌లిస్తున్నార‌ని, మండిప‌డ్డారు జ‌గ‌న్.. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల డ‌బ్బు ఎక్క‌డ పెట్టారు అని బాబుని అడిగితే ప్ర‌జ‌ల‌కే ఖ‌ర్చు పెట్టాన‌ని సాకుచేప్పి త‌ప్పించుకుంటున్నార‌ని అన్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.