బాబుకు చుక్క‌లు చూపించిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 19:10:23

బాబుకు చుక్క‌లు చూపించిన జ‌గ‌న్

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌ యాత్ర‌లో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లా పెరికగూడెంలో దళిత ఆత్మీయ సమ్మేళనం స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ  స‌భ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 ఎన్నిక‌ల్లో త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలో వ‌చ్చిన చంద్ర‌బాబు వాటిని ఒక్క‌టైనా అమ‌లు చేశారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.
 
అయితే ఇప్పుడు సార్వ‌త్రిక ఎన్నిలు ద‌గ్గ‌ర‌పడుతుండ‌డంతో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు గుర్తుకు వ‌స్తున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు గ‌తంలో ఓ కార్య‌క్ర‌మంలో ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రు కోరుకుంటార‌ని విమ‌ర్శ‌లు చేశార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న‌ చంద్ర‌బాబు వారికి చేదోడు వాదోడుగా అండ‌గా ఉండాల్సింది పోయి ద‌ళితుల‌ను కించ‌ప‌రిచే విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని జ‌గ‌న్  ప్ర‌శ్నించారు. త‌మ ప్ర‌భుత్వం ద‌ళితుల ప్ర‌భుత్వ‌మ‌ని, చెప్పుకునే చంద్ర‌బాబు వారిని కించప‌రిచే విధంగా వ్యాఖ్య‌లు చేయ‌డం చాలా సిగ్గుచేట‌ని జ‌గ‌న్ అన్నారు.
 
ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాయి కాబ‌ట్టి చంద్ర‌బాబుకు ద‌ళితులు గుర్తుకు వ‌స్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు హయాంలో ద‌ళితుల ప‌ట్ల వివక్ష కనిపిస్తోందని, దేశానికి స్వాతంత్రం వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ ద‌ళితుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. మంచి అన్నది మాల అయితే,నేను మాల అవుతా అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుని, వైసీపీ అధికారంలోకి వ‌స్తే వారికి కుటుంబ వ్య‌క్తిలా ప‌ని చేస్తాన‌ని జగ‌న్ హామీ ఇచ్చారు.
 
అలాగే ద‌ళితుల‌కు ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ ఛార్జీ ధరలను సూచిక ప్రకారం పెంచుతామని చెప్పిన చంద్రబాబు ఇప్పటి వరకూ పెంచకపోగా, అడ్డగోలుగా ప్రభుత్వ హాస్టళ్లను మూసివేయిస్తున్నారని ఆరోపించారు జ‌గ‌న్... ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలవుతుందా? అని ప్రశ్నించారు జగన్. ద‌ళితుల‌కు కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను కూడా చంద్ర‌బాబు సక్రమంగా ఖర్చు చేయలేదని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.