వైసీపీలో చేరిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan padayatra in guntur district
Updated:  2018-03-27 18:14:23

వైసీపీలో చేరిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు

తెలుగుదేశం పార్టీ అధినేత  సీఎం చంద్ర‌బాబు పాల‌న పై గుంటూరు జిల్లాలో స‌త్తెన‌ప‌ల్లిలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది... అక్క‌డ పార్టీ నాయ‌కుల‌తో జ‌గ‌న్ అశేష జ‌న‌సంద్రోహం మ‌ధ్య జ‌గ‌న్  మాట్లాడారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి, స‌త్తెన‌ప‌ల్లి -న‌ర‌స‌రావుపేట‌లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి, ఇక్క‌డ కారణం మీకు కూడా తెలిసిందే అని అన్నారు జ‌గ‌న్.
 
ఇక్క‌డ రైతులు చెప్పే మాట ఒక‌టే, నాగార్జునా సాగ‌ర్ కుడికాల్వా ద్వారా మాకు నీరు అందాలి, 145 టీఎంసీల నిక‌ర జ‌లాల కేటాయింపులు మాకు ఉన్నాయి... 11 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్ట‌కు సంబంధించి నీటి అలాట్ మెంట్ మాకు ఉంది  అని అన్నారు.. ప‌క్క‌నే నీరు ఉన్నా మాకు పంట పండించుకునే అవ‌కాశం లేద‌ని, ఈ నాలుగేళ్లుగా వ‌రిపంట వేసుకోవ‌డానికి అవ‌కాశం లేకుండా పోయింది అని రైతులు చెబుతున్నారు.
 
అక్క‌డ తెలంగాణ‌లో కేసీఆర్ కు ఉంది ఏమిటి, ఇక్క‌డ ఏపీలో బాబుకు లేనిది ఏమిటి అని రైతులు ప్ర‌శ్నిస్తున్నారు.. అయితే ఇక్క‌డ బాబుకు రోషం లేదు అక్క‌డ కేసీఆర్ కు రోషం ఉంది అని జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. బాబు రైతుల కోసం  కేసీఆర్ ని నీరు అడిగితే అక్క‌డ కేసీఆర్ ఓటుకునోటు ఆడియో టేపులు బ‌య‌ట‌పెడ‌తార‌ని భ‌యంతో వెన‌క‌డుగు వేస్తున్నారు అని జ‌గ‌న్ ఫైర్ అయ్యారు..
 
మినువులు కంది, పెస‌లు  పంట‌ల‌కు స‌రైన గిట్టుబాటు ధ‌ర‌లేదు అనేది తెలిసిందే .. రైతులు ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నా ముఖ్య‌మంత్రి ద‌ళారీగా వ్య‌వ‌హారించడం వ‌ల్ల మాకు రేటు రావ‌డం లేదు అని రైతులు అంటున్నారు అని అన్నారు జ‌గ‌న్... మా నుంచి కొన్న స‌రుకుల‌ను ప్యాక్ చేసి, హెరిటేజ్ లో నాలుగు రెట్లు అమ్ముతున్నారు అని రైతులు విమ‌ర్శిస్తున్నారు అని జ‌గ‌న్ తెలియ‌చేశారు.
 
చంద్ర‌బాబు చెప్పే గ‌ణాంకాలు ఎలా ఉన్నా ఆయ‌న లంచాలు మాత్రం ట్రిపుల్ డిజిట్లు పెరిగాయి అని అన్నారు.. ఇక్క‌డ వ్యాపారుల ద‌గ్గ‌ర కోడెల స‌ర్వీస్ ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారు అని జ‌గ‌న్ ఫైర్ అయ్యారు.. తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి  సినిమాల వ‌ర‌కూ అన్నింటికి   కేఎస్ టి వ‌సూలు చేస్తున్నారు అని జ‌గ‌న్ మండిప‌డ్డారు...బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు వేలు ఓటుకు ఇస్తాను అంటాడు అది స‌రిపోదు అని ఐదువేలు గుంజండి అని  జ‌గ‌న్ ప్ర‌జల‌కు తెలియ‌చేశారు కాని ఓటు వేసేట‌ప్పుడు మీ మ‌న‌సాక్షి ప్ర‌కారం ఓటు వేయండి అని అన్నారు జ‌గ‌న్.. 
 
తెలుగుదేశం పార్టీకి  రాజీనామాలు  చేసి నియోజ‌క‌వ‌ర్గంలో ఇంచార్జ్ గా ప‌నిచేసిన నిమ్మ‌కాయ‌ల రాజ‌నారాయ‌ణ,ఆతుకూరి నాగేశ్వ‌ర‌రావు మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్  జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.