బాబుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy padayatra image
Updated:  2018-03-11 11:54:52

బాబుపై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అడుగ‌డుగున ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.. ఈ సంక‌ల్ప యాత్ర ఇడుపుల పాయ‌లో మొద‌లుకుని నేడు నిర్విరామంగా ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌కవర్గంలో కొన‌సాగుతోంది.. ఈ యాత్ర‌లో మ‌రోసారి జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు..
 
ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా బాబు అడ్డుకుంటున్నార‌ని, కేంద్రానికి అమ్ముడుపోయి  ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా  నిర్దాక్ష‌ణంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని అన్నారు జ‌గ‌న్... హోదాకోసం ముఖ్య‌మంత్రి గ‌త నాలుగేళ్లుగా రోజుకొక మాట చెప్పి నాట‌కాలు ఆడుతున్నార‌ని తెలిపారు... 
 
అయితే కేంద్రం పై తాము క‌చ్చితంగా అవిశ్వాసం పెట్టి తీరుతామ‌ని, అవిశ్వాసం పెట్టిన త‌ర్వాత త‌మ పార్టీ ఎంపీల రాజీనామాను మీడియా ముందు వెల్ల‌డిస్తార‌ని జ‌గ‌న్ తెలిపారు... కాగా ఇప్ప‌టికైనా హోదాపై మాటెత్త‌ని చంద్ర‌బాబుపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌క ముందే త‌మ అవిశ్వాస తీర్మానానికి క‌లిసి రావాల‌ని జ‌గ‌న్ కోరారు...
 
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ పాడిన పాటే పాడుతున్నా కానీ, ఏ మాత్రం చిత్తశుద్ది లేకుండా ముఖ్య‌మంత్రి వారి చెంతే ఉన్నార‌ని అన్నారు... జైట్లీ హోదాపై మీడియా ముందు చెప్పిన‌ప్పుడే బాబు వారి మంత్రుల‌తో రాజీనామా చేయించి ఉంటే ఈ పాటికి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేద‌ని వైసీపీ అధినేత అన్నారు... కాగా నాలుగేళ్లు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అనుభ‌వించి ఇప్పుడు చంద్ర‌బాబు ప్లేటు మార్చుతున్నార‌ని జ‌గన్ మండిప‌డ్డారు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.