బాబుకు చెమ‌ట‌లు ప‌ట్టించిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-12 18:46:52

బాబుకు చెమ‌ట‌లు ప‌ట్టించిన జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఈ రోజు ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాను పూర్తిచేసుకుని తూర్పూ గోదావ‌రి జిల్లాలో అడుగు పెట్టారు. జ‌గ‌న్ కు అడుగు పెట్ట‌గానే తూగో జిల్లా ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి మీద జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తుంటే ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం పాద‌యాత్ర‌కు హాజ‌రై జ‌న‌నేత జ‌గ‌న్ అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగారు. 
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ తూ.గోలోకి అడుగు పెట్టిన సంద‌ర్భంగా పార్టీనాయ‌కులు రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ, మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌డం త‌న క‌ల‌ని ప్ర‌చారం చేశార‌ని, అయితే ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక ఇంత వ‌ర‌కు వాటి ప‌నుల‌ను పూర్తి చేయ‌లేక పోయార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.
 
దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన‌ ప‌ది శాతాన్ని చంద్ర‌బాబు పూర్తి చేయ‌లేకపోతున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.అలాగే 1995 నుంచి 2004 వ‌ర‌కూ చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మించాల‌ని గుర్తుకు రాలేదా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఎప్పుడైతే వైఎస్సార్ పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నుల‌ను చేప‌డితే అప్పుడు చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మించ‌డం త‌న క‌ల అని చెబుతార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.