అలాంటి వారిని బొక్క‌లో వేసి నాలుగు తంతే...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-17 15:06:42

అలాంటి వారిని బొక్క‌లో వేసి నాలుగు తంతే...

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట విశాఖ ప‌ట్నం జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతుంది. శ్రీ విరాట్ విశ్వ‌క‌ర్మ‌భ‌గ‌వాన్ జ‌యంతి సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 
 
అనంత‌పురం తాడిప‌త్రిలోని శ్రీ ప్ర‌పోదానంద స్వామి ఆశ్ర‌మ భ‌క్తులు పాద‌యాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కలుసుకున్నారు. త‌మ‌పై కొద్దిరోజుల క్రితం నుంచి జేసీ వ‌ర్గీయులు దాడీ చేస్తున్నారంటూ త‌మ ఆవేద‌న‌ను జ‌న‌నేత‌కు చెప్పుకున్నారు. ఇక వారి భాద‌ను తెలుసుకున్న జ‌గ‌న్ ఆశ్ర‌మ బాధితులంద‌రికి అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. తాడిప‌త్రి ప్ర‌జ‌లు విశాఖ‌ప‌ట్నం వ‌ర‌కు వ‌చ్చి త‌న‌కు ఫిర్యాదు చేసే ప‌రిస్థితికి వ‌చ్చింద అంటే రాష్ట్రంలో న్యాయ‌వ్య‌వ‌స్థ ద‌య‌నీయ‌మై ప‌రిస్థితిలో ఉంద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.
 
ప్ర‌స్తుతం తాడిప‌త్రిలో రౌడీ రాజ్యం చ‌ల‌రేగిపోతుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న వాళ్లను ద‌గ్గరుండి కాపాడుకుని రౌడీయిజం చేసేందుకు ప్రోత్స‌హిస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అంతేకాదు వెస్ట్ గోదావ‌రి జిల్లాలో చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ప‌రిస్థితి తీసుకున్నా ఇదే ప‌రిస్థితి క‌నిపించిందని ఆరోపించారు. ఒక ప్ర‌భుత్వ అధికారి అయిన‌టు వంటి ఎమ్మార్వో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దౌర్జ‌న్యంగా జుట్టు ప‌ట్టుకుని కొట్టార‌ని గుర్తు చేశారు. 
 
ఇక ఇప్పుడు ఏకంగా  స్వామివారి భ‌క్తుల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొడుతున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు ఇలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిని రాజ‌కీయ నాయ‌కుల‌ను బొక్క‌లో వేసి నాలుగు తంతే ఇలాంటి అక్ర‌మాలు జ‌రుగ‌కుండా ఉంటాయ‌ని జ‌గ‌న్ ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయవ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తింటుంద‌ని ఇలాంటివి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్య‌క్షంగా పోత్స‌హించ‌డం కాదా అని ప్ర‌శ్నించారు జ‌గ‌న్. అంతేకాదు స్వామివారికి అన్నివిధాలుగా అండ‌గా నిలుస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.