టీడీపీకి జ‌గ‌న్ కొత్త పేరు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-07 16:47:43

టీడీపీకి జ‌గ‌న్ కొత్త పేరు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి ఏ ముహూర్తాన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర మొద‌లు పెట్టారో కానీ అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ యాత్ర‌కు ఊరూ వాడా, కులం మ‌తం అన్న‌ తేడా లేకుండా ప్ర‌తీ ఒక్క‌రు జ‌న‌నేత‌కు నేనున్నాను అన్నా అంటూ మ‌మేక‌మైపోతున్నారు జ‌నాలు.
 
జ‌గ‌న్ ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌తీ ఒక్క‌రి స‌మ‌స్యను తెలుసుకుంటూ, వారికి చేదోడువాదోడు అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇస్తున్నారు... ఒక‌వైపు ప్ర‌జ‌ల‌కు కొండంత భ‌రోసా ఇస్తూ,మ‌రోవైపు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ త‌న సంక‌ల్ప‌యాత్ర‌తో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక జ‌గ‌న్ ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప‌లు చోట్ల బ‌హిరంగ స‌భను ఏర్పాటు చేసిన‌ప్పుడల్లా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆ పార్టీ నాయ‌కులు అవినీతిప‌రులు అంటూ ప్ర‌తీ చోటా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు... గ‌త నాలుగు సంవ‌త్స‌రాల  నుంచి సైకిల్ పార్టీ  నాయ‌కులు అవినీతే ల‌క్ష్యంగా చేసుకుని అనేక చోట్ల అన్యాయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని సంక‌ల్ప‌యాత్ర‌లో చెప్పుకొస్తున్నారు జ‌గ‌న్.
 
కానీ కొద్ది రోజుల క్రితం అధికార తెలుగుదేశం నాయ‌కులు చేస్తున్న అవినీతిని ఆధారాల‌తో స‌హా జ‌గ‌న్ మీడియా  ముందు వెల్ల‌డించ‌డంతో, సాక్షి ఛాన‌ల్ తో స‌హా ముఖ్య‌మంత్రి అనుకూల ఎల్లో మీడియాలు కూడా ఈ స‌మాచారాన్ని క‌వ‌ర్ చేశారు.
 
దీంతో ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై పెట్టుకున్న అపార  న‌మ్మ‌కాన్ని ఆయ‌న వ‌మ్ము చేయ‌డంతో రాష్ట్రంలో  ఏదో ఒక మూలన టీడీపీపై వ్య‌తిరేక‌త విప‌రీతంగా పెరిగిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు... అంతే కాదు ప్ర‌తీ వంద మందిలో సుమారు 80 మంది  టీడీపీ నాయ‌కులు అవినీతి ప‌రులని, దేశంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేని అక్ర‌మాల‌ను సైకిల్ పార్టీ నాయ‌కులు చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు అంటున్నారు.... వీరికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెట్టిన పేరే స్ప‌స్ట‌మైన‌దని ఈ పేరు టీడీపీ ఉన్నంత కాలం నిలిచిపోతుంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు.... మొత్తానికి టీడీపీకి జ‌గ‌న్ పెట్టిన పేరు అవినీతి  పార్టీ అదన్న‌మాట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.