స‌స్పెన్స్ కు తెర‌తీసిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-31 16:15:54

స‌స్పెన్స్ కు తెర‌తీసిన జ‌గ‌న్

వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ ప‌రంగా త‌న నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్నారు... మ‌రీ ముఖ్యంగా ప‌శ్చిమ‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న వ‌స్తోంది.. ఇక  దూకుడుగా టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలి అని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా జిల్లాలో వ‌ర్గ‌పోరు తారాస్దాయికి చేర‌డం, ఆరు సెగ్మెంట్ల‌లో వివాదాలు టీడీపీకి ఓ పెద్ద గుదిబండ‌లా మారాయి.ఇటు ఏలూరు నుంచి మొద‌లైన జ‌గ‌న్ ప‌శ్చిమ జిల్లా పాద‌యాత్ర నిరంత‌రంగా కొన‌సాగుతోంది.. ముఖ్యంగా ఆయ‌న కొవ్వూరు నుంచి తూర్పుగోదావ‌రిలోకి అడుగుపెట్ట‌నున్నారు.. ఇటు కాపుల సెగ్మెంట్లు అధిక బీసీ ఓటు బ్యాంకు ఉన్న  ప్రాంతాల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర పై ఇటు తూగోలో కూడా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.
 
అయితే ఇటు క్ష‌త్రియ ఓటు బ్యాంకు బలంగా ఉన్న‌ప్రాంతం ఆకివీడు, ఉండి, కైక‌లూరులో కొన్ని ప్రాంతాలు అలాగే భీమ‌వ‌రం, న‌ర‌సాపురం ఆ ప్రాంతాల్లో జ‌గ‌న్ దూసుకుపోతున్నారు...అయితే ఇప్ప‌టి నుంచే 15 సెగ్మెంట్ల‌లో జ‌గ‌న్ వైసీపీ  ఇంచార్జ్ ల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు..ఎవ‌రు ఎవ‌రు పార్టీ త‌ర‌పున అభ్య‌ర్దులు అనేది జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తున్నారు..
 
బ‌హిరంగ స‌భ‌ల్లో కూడా ఇక్క‌డ ఎటువంటి స‌మ‌స్య‌ల ఉన్నాయి అనేది తెలియచేస్తున్నారు ప్ర‌జ‌ల‌కు... ఇక పార్టీ త‌ర‌పున నాయ‌కులు ఎవ‌రు అభ్య‌ర్దులుగా పోటికి అనేది జ‌గ‌న్ ముందుగా బ‌హిరంగ స‌భ‌ల్లో తెలియ‌చేయ‌డంతో, ఇక్క‌డ వ‌ర్గ‌పోరుకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు... ఇక ప‌శ్చిమ‌లో భీమ‌వ‌రంలో ఎవ‌రు వైసీపీ త‌ర‌పున పోటీ అని  ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ మీమాంశ ఉండేది ...ఇక జ‌గ‌న్ ఇక్క‌డ పాద‌యాత్ర‌లో ఆ స‌స్పెన్స్ కు క్లారిటీ ఇచ్చారు...మాజీ  ఎమ్మెల్యే వైసీపీ భీమ‌వరం ఇంచార్జ్  గ్రంధి శ్రీనివాస్ పేరును ప్ర‌క‌టించ‌డం, ఆయ‌నే పోటి అని చెప్ప‌డంతో ఇప్పుడు రాజ‌కీయంగా ఇక్క‌డ ఎటువంటి వ‌ర్గ‌పోరు లేకుండా చేశారు.
 
ఇటు భీమ‌వ‌రం ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి అంజిబాబు, అలాగే పార్టీ త‌ర‌పున ముందుకు వెళుతున్నారు...ఇటు గంటాకు వియ్యంకుడు కావ‌డం,  ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత బ‌లంగా పార్టీ త‌ర‌పున వెళ‌తారు అని టీడీపీ చెబుతోంది.. అయితే ఇక్క‌డ జ‌గ‌న్ స‌భ‌కు భారీగా జ‌నం హాజ‌రుకావ‌డం చూస్తుంటే భీమ‌వ‌రంలో వైసీపీ జెండా గ్రంధిశ్రీనివాస్ రెప‌రెప‌లాడిస్తారు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు అంటున్నారు పుర‌ప్ర‌జ‌లు... వైసీపీ భీమ‌వ‌రం శ్రేణులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.