ఆ ఒక్క‌టి చాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-19 16:21:13

ఆ ఒక్క‌టి చాలు

ఏదైనా సాధించాలి అనే ప‌ట్టుద‌ల ఉంటే చాలు మ‌నిషి సాధించ‌లేనిది అంటూ ఏది ఉండ‌దు. ఈ మాటలు పాఠాలు చెప్పే గురువులు నిరంతరం విద్యార్థుల‌కు చెబుతూనే ఉంటారు. అలా గురువు చెప్పిన బాట‌లో విద్యార్థి న‌డుచుకుంటు వెళ్తు రానున్న రోజుల్లో ఒక ఉన్నత‌ స్థాయికి చేరుకుని రాష్ట్రంలో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటుంటారు. అయితే మ‌ధ్య‌లో అనేక ఒడి దుడుకులు, ఇబ్బందిక‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. వాట‌న్నింటిని అధిక‌మించి గెలుపు కోసం సాహసం చేయాలి అప్పుడే విజ‌యం సాధించ‌గ‌ల‌రు. 
 
అలా నిరంత‌రం కృషి చేస్తూ ప్ర‌జ‌ల అభివృద్ది కోసం నిరంతరం పాటు ప‌డుతూ ఎర్ర‌ని ఎండ‌ల‌ను సైతం లెక్క చేయ‌కుండా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్నారు. త‌న తండ్రికి ఎంత ఓపిక ఉందో జ‌గ‌న్ కు కూడా అంతే ఓపిక వుంది. 2004 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గ‌ల్లంతు అవుతుంది అనే నేప‌థ్యంలో వైయ‌స్సార్ ఒంటి చేతితో పార్టీ బాధ్య‌త‌లు తీసుకుని నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉంటూ ప్ర‌జా సేవ చేస్తూ, అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రంలో పాద‌యాత్ర‌ను చేప‌ట్టి అధికారంలోకి వ‌చ్చారు వైఎస్సార్. 
 
ఇక అదే కృషితోనే జ‌గ‌న్ కూడా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను చేప‌ట్టారు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో తండ్రికి త‌గ్గ కొడుకు అని గూర్తింపు తెచ్చుకున్నారు జ‌గ‌న్. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014 లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లంద‌రూ రాష్ట్రాన్ని ముందుకు న‌డ‌ప‌గ‌ల వ్య‌కి కేవ‌లం చంద్ర‌బాబు మాత్ర‌మే అని భావించి ప్ర‌జ‌లంద‌రు ఆయ‌న‌కు అధికార పీఠాన్ని అందించారు. ప్ర‌జ‌ల అండ‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ఇంత వ‌ర‌కూ అమ‌రావ‌తిలో ఒక స్థిర‌మైన బిల్డింగ్ కూడా నిర్మించ‌లేదు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేసి పెద్ద పొర‌పాటు చేశామ‌ని భావిస్తున్నారు.
 
ఇక ఈ పొర‌పాటును స‌రిచేసుకోవాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రి చేయాల‌ని ప్ర‌జ‌లంద‌రు భావిస్తున్నారు. జ‌గ‌న్ ని ముఖ్య‌మంత్రి చేస్తే మ‌ళ్లీ వైయ‌స్సార్ పాల‌న‌ను చూడ‌వ‌చ్చ‌ని ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ చేస్తున్న కృషి ప్ర‌త్యేక హోదా కోసం అలుపెరుగ‌ని పోరాటం ఇవ‌న్ని రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నించారు.అందుకే 40 ఇయ‌ర్స్  ఇండ‌స్ట్రీ కంటే 40 ఇయ‌ర్స్ కుర్రాడే రాష్ట్రాన్ని అభివృద్ది చేయ‌గ‌ల‌రు అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ప్ర‌జ‌లు ఇలా అన‌డానికి కార‌ణం జ‌గ‌న్ లో కృషి సాహ‌సం, ప‌ట్టుద‌ల ఈ ముడు ఆయ‌న‌లో వున్నాయి కాబట్టి ఆయ‌నంటే ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని అభిమానం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.