జ‌గ‌న్ జోక్యం చేసుకోక పోతే అక్క‌డ వైసీపీ గెలుపు క‌ష్టం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-07-25 10:33:12

జ‌గ‌న్ జోక్యం చేసుకోక పోతే అక్క‌డ వైసీపీ గెలుపు క‌ష్టం

ప్ర‌తిక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికారమే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో పాద‌య‌త్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో  భాగంగా జ‌గ‌న్ ట‌చ్ చేసి వెళ్లిన ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఊపు అందుకుంద‌నే చెప్పాలి. ఇక ఆ ఊపు ను ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే ఉంచాల‌న్న‌ నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వైసీపీ ఇంచార్జ్ లు ప్ర‌తీ గ్రామంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ప్ర‌జ‌ల్లో వైసీపీ మైలేజ్ ను మ‌రింత పెంచుతున్నారు.
 
జ‌గ‌న్ అడుగు పెట్టిన ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఊపు అందుకుంటుంది కానీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వైసీపీ కాస్త బెడిసికొడుతుంది. ఇంత‌కు ఆ నియోజ‌కవ‌ర్గం ఏంట‌ని అనుకుంటున్నారా.. అదే నాటి ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కు కంచుకోట‌గా వ‌స్తున్న నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌వ‌ర్గంలో టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి ఎమ్మెల్యే బాల‌కృష్ణ వ‌రకు టీడీపీ ఓట‌మి చ‌విచూడ‌లేదు. 
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఈ జిల్లాలో వైసీపీ పాగా వెయ్యాల‌నే ఉద్దేశ్యంతో వైసీపీ ఇంచార్జ్ న‌వీన్ నిశ్ఛ‌ల్ పావులు క‌దుపుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు వేస్తూ నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ సేవా, రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌తో బిజీ అయిపోయారు న‌వీన్.
 
హిందూపురంలో ఆయ‌న ప్ర‌జా సేవ బాగానే చేస్తున్నా కానీ, సొంత పార్టీ నాయ‌కులు టీడీపీ నాయ‌కుల కంటే వ్య‌తిరేకంగా వ్వ‌హరిస్తున్నారు. పోనీ వారు రానున్న‌రోజుల్లో టీడీపీ తీర్థం తీసుకోబోతున్నారా అంటే అదీ లేదు. తాము ఎట్టి ప‌రిస్థితిలో వైసీపీని వీడం కానీ, న‌వీన్ కు మాత్రం స‌పోర్ట్ చెయ్య‌మ‌ని తెగేసి చెబుతున్నారు. 
 
ఒక విధంగా చెప్పాలంటే గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోవ‌డానికి వీరే కార‌ణం అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10వేల ఓట్లను సాధించింది. ఆ ఓట్లు వైసీపీ వైపు తిరిగి ఉంటే ఖ‌చ్చితంగా వైసీపీ గెలుపు త‌థ్యం కానీ చేతూలారా వైసీపీ గెలుపును మిస్ చేసుకుంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ఓట్ల చీలికను నివారించాల‌నే ఉద్దేశంతో, కాంగ్రెస్ కి ప‌డిన ఓట్ల‌లో మెజార్టీ త‌న‌వైపు తిప్పుకోవాల‌ని న‌వీన్ ఆశిస్తున్నారు.
 
అయితే అందులో మైనార్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్ల‌ను లాక్కునే విష‌యంలో న‌వీన్ స‌క్సెస్ అయ్యారు కానీ, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్ల‌ను వైసీపీ వైపు లాక్కునే విష‌యంలో పూర్తిగా విఫ‌లం అవుతున్నారు న‌వీన్. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో హిందూపురం ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బందువు వైఎస్ కొండా రెడ్డి రంగంలో దిగారు. కానీ ఫ‌లితం మాత్రం శూన్యం. 
 
వైసీపీ లో కీల‌క నేత‌లుగా ఉన్న నాయ‌కులు కూడా న‌వీన్ పై పూర్తి స్థాయిలో వ్య‌తిరేకంగా ఉన్నారు. ఈ వ‌ర్గ‌పోరు ఇలానే కొన‌సాగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ ఓట‌మి ఖాయం అని తెలుస్తోంది. సో.. హిందూపురం వ్య‌హారంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా జోక్యం చేసుకోవాల్సి ఉంది. లేకపోతే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని రాయ‌బారానికి పంపిస్తే త‌ప్ప ఇక్క‌డ ప‌రిస్థితి చ‌క్క‌బ‌డేలా లేదు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.