జ‌గ‌న్ ఈ సెగ్మెంట్ పై చ‌ర్య‌లుతీసుకోవాలి లేక‌పోతే త్రిముఖ‌పోరే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-10-24 11:52:16

జ‌గ‌న్ ఈ సెగ్మెంట్ పై చ‌ర్య‌లుతీసుకోవాలి లేక‌పోతే త్రిముఖ‌పోరే

బెజ‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌ర్గంలోని ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదిప‌త్య‌పోరు సాగుతోందిని విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతున్న ముగ్గురు లీడ‌ర్ల వార్ చివ‌ర‌కు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందోన‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.
 
ఇక ఈ విష‌యంలో పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జోక్యం చేసుకుని స‌ర్థి చెబితే బాగుంటుంద‌ని లేక‌పోతే త్రిముర్తులుగా మారే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌ వ‌ర్గానికి పార్టీ ఇంచార్జ్ గా వంగ‌వీటి రాధ ఉన్నారు. 
 
ఇక 2014లో ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఓట‌మిపాలు అయిన గౌత‌మ్ రెడ్డి ఇలీవ‌లే అనుచిత వ్యాఖ్య‌లు చేసి పార్టీలో తీవ్ర క‌ల‌క‌లం రేపారు. ఇక ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు రాధ అనుచ‌రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక మ‌రో వైపు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాదివిష్ణు కూడా  ఇటీవ‌లే పార్టీ కండువా వేసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను సెంట్ర‌ల్ నియోజ‌క‌వర్గం నుంచి పోటీ చేస్తాన‌ని భిష్మించి కుర్చున్నారు. 
 
దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నాయ‌కులు ఆధిప‌త్య పోరుకు సై అంటున్నారు. వీలైనంత త్వ‌ర‌గా పార్టీ అధిష్టానం వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లేక‌పోతే 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో తీవ్ర ప్ర‌భావం చూ