జ‌గ‌న్ ఫాలో అవుతున్న పంచ సూత్రాలు ఇవే..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-10-10 13:12:17

జ‌గ‌న్ ఫాలో అవుతున్న పంచ సూత్రాలు ఇవే..

ప్ర‌తిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌ను ప్ర‌జ‌లు ఇంతలా ఆద‌రించ‌డం ఏంట‌ని అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఆశ్చ‌ర్య పోతున్నారు. మొద‌ట్లో ఈ పాద‌యాత్ర కేవ‌లం క‌డ‌ప లేక క‌ర్నూల్ జిల్లాకు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని ఎద్దేవా చేసిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు జ‌గ‌న్ కు ఇంత‌లా 13 జిల్లాల ప్ర‌జా మ‌ద్ద‌తు ఎలా వ‌స్తుంద‌ని ఆలోచిస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌నే  ప‌నిలో ప‌డ్డార‌ట‌. అలాగే అమాంతంగా రాష్ట్ర ప్ర‌జలు తెలుగుదేశం పార్టీని వ్య‌తిరేకంగా చూడ‌టానిక గ‌ల కార‌ణాలు ఏంట‌ని దీర్ఘంగా ఆలోచిస్తున్నార‌ట‌. గతంలో స‌మ‌యం లేదు మిత్ర‌మా రాజ‌కీయ‌మా లేక ఫిరాయింపులా అన్నకోణంలో ఆలోచించి సుమారు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీలోకి చేర్చుకున్నారు చంద్ర‌బాబు నాయుడు. 
 
ఇక ఆయ‌న ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డంతో పార్టీ ప్ర‌తిష్ట‌త‌లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఇక అదే స‌మ‌యంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఫిరాయింపు సెగ‌లు త‌గులుతున్నాయ‌ట‌. అందుకే చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నికల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి జ‌గ‌న్ ఫాలో అవుతున్న ర‌హ‌స్యాల‌ను తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు. 
 
జ‌గ‌న్ ఫాలో అవుతున్న పంచ‌నామ సూత్రాలు ఇవే..
 
1. జ‌గ‌న్ ఆలోచ‌న ఒకే విధంగా ఉంటుంది, 2014లో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అభివృద్ది ఏమీ లేద‌నే ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ చేయ‌డం.
 
2. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను  ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం.
 
3. వైసీపీ అధికారంలోకి వ‌స్తే జ‌గ‌న్ చేయ‌గ‌లిగింది మాత్ర‌మే చెప్ప‌డం,  చంద్ర‌బాబు అలాగే ఫిరాయింపు రాజ‌కీయాలు చేశాడ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డం.
 
4. 2014లో టీడీపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేదు, యువ‌త‌కు ఉద్యోగ క‌ల్ప‌న‌, ప‌థ‌కాల హామీల‌ క‌ల్ప‌న నెర‌వేర్చ‌లేద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం.
 
5. అడుగ‌డుగును ఇసుక‌ను మాఫి చేస్తూ అవినీతి అమ‌రావ‌తిగా మార్చ‌డం వంటి విష‌యాల‌ను జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.