తప్పును సరిచేసుకుంటున్న వైయస్ జగన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-21 12:52:02

తప్పును సరిచేసుకుంటున్న వైయస్ జగన్

గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన పొర‌పాట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌కుండా స‌రిచేసుకుంటున్నారు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్గీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఇందులో భాగంగానే రాజ‌కీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చిన్న చిన్న పొర‌పాట్ల కారణంగా స్వ‌ల్ప ఓట్ల శాతంతో అధికారాన్ని చేజిక్కించుకోలేక‌పోయింది వైసీపీ. 

2014 ఎన్నిక‌లు ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యేంత వ‌ర‌కు అంద‌రూ వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని  అనుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప‌లు ఉచిత హామీలతో పాటు జ‌న‌సేన‌-బీజేపీ బ‌లం తోడ‌వ‌డంతో ఒంట‌రిగా బ‌రిలో దిగిన వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన  సీట్ల‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. 

ఇందుకు అనేక కార‌ణాలు ఉన్నాయ‌నే చెప్పాలి. ముఖ్యంగా గెలిచేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉన్న నేప‌ధ్యంలో అభ్య‌ర్ధుల ఎంపిక  విష‌యంలో పొర‌పాట్లు  జ‌రిగాయ‌నేది ప‌లువురి వాద‌న‌. కొన్ని నెల‌ల  క్రితమే   ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వూలో  దివంగ‌త నేత,మాజీ ఎమ్మెల్యే   భూమా నాగి రెడ్డి బ‌య‌ట‌పెట్టారు. 

ముఖ్యంగా  ఉభ‌య గోదావరి జిల్లాల‌తో పాటు అనంత‌పురం జిల్లాలో అభ్య‌ర్ధుల విష‌యంలో త‌ప్పు జ‌రిగిపోయింద‌ని,  ముందుగా  ఎవ‌రికైతే మాటిచ్చారో వారికి జ‌గ‌న్ సీట్లు క‌ట్ట‌బెట్టార‌ని, అయితే,  ఎంపిక చేసుకున్న వారు గెలుస్తారా..... లేదా అన్న దానిపై దృష్టి సారించ‌లేద‌ని  భూమా నాగి రెడ్డి ఆ ఇంట‌ర్వూలో పేర్కొన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత భూమా నాగి రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. అది వేరే విష‌యం అనుకోండి!!

ప్ర‌స్తుతం  మాత్రం  వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఇలాంటి పోర‌పాట్లు జ‌ర‌గ‌కుండా  ఉండేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. రాజ‌కీయంగా, ఆర్ధికంగా, స‌మాజిక వ‌ర్గాల ప‌రంగా మెరుగైన అభ్య‌ర్ధ‌ల‌నే ఎంపిక చేసేందుకు వైయ‌స్  వ్యూహాలు ర‌చిస్తున్నారు. 

ఓ వైపు ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తూనే మ‌రోవైపు గ‌తంలో మాదిరిగా  ఆల‌స్యం చేయ‌కుండా  ఈ సారి ముందుగానే అభ్య‌ర్ధుల  ప్ర‌క‌ట‌న చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు హామీల ప్ర‌క‌ట‌నలో కూడా వైయ‌స్ జ‌గ‌న్ ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. 

ఇలా గ‌త ఎన్నిక‌ల్లో   అధికారం చేజారిపోవ‌డానికి ఏ ఏ అంశాలైతే  కార‌ణాల‌య్యాయో  వాటిని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో అమలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా.... 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా  త‌ప్పుల‌ను స‌రిచేసుకుంటూ పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు జ‌గ‌న్. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.