విజ‌య‌సాయి రెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌విని అప్ప‌జెప్పిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-24 17:50:40

విజ‌య‌సాయి రెడ్డికి మ‌రో కీల‌క ప‌ద‌విని అప్ప‌జెప్పిన జ‌గ‌న్

2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రపున ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక్క‌రే తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై అలాగే అధినేత చంద్ర‌బాబు నాయుడుపై విమ‌ర్శ‌లు చేసేవారు. ఇక ఆ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కుల‌పై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో పాటు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆయ‌న విమ‌ర్శ‌లను చూసి పార్టీ నాయ‌కులే కాకుండా సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా ఆశ్చ‌ర్యానికి గురిచేసింది కొద్ది రోజుల క్రితం. దీంతో అంద‌రూ విజ‌య‌సాయి రెడ్డికి వైసీపీలో నెంబ‌ర్ 2 అనే ప్ర‌శంస కూడా ఉంది. 
 
ఇక‌ ఇదే క్ర‌మంలో కొద్దిరోజుల క్రితం ప‌విత్రమైన పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌లో స్వామి వారి పింక్ డైమండ్ పోయింద‌ని ప్ర‌ధాన‌ అర్చ‌కులు మీడియాకు తెలిపారు. అయితే ఈ డైమాండ్ ఎవ‌రు దొంగ‌లించ‌లేద‌ని అది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇంట్లో త‌ప్ప ఎక్కడ‌ ఉండ‌దని విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు తాను చెప్పిన 12 గంట‌ల‌లోపు ముఖ్య‌మంత్రి నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తే ఖ‌చ్చితంగా దొరుకుతుంద‌ని లేకుంటే చంద్ర‌బాబు విదేశాల‌కు త‌ర‌లిస్తారని చెప్పారు. చంద్ర‌బాబు నివాసంలో పింక్ డైమండ్ దొర‌క‌క‌పోతే తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే తాజాగా జ‌గ‌న్ ఆయ‌న‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ అప్ప‌గించారు. ఇప్ప‌టికే వైసీపీ ఎంపీగా, అలాగే జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా య‌న‌లేని సేవ‌ల‌ను అందిస్తున్న ఆయ‌న‌కు వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత‌గా నియ‌మించారు  జ‌గ‌న్. ఇప్ప‌టికే ఈ నియామ‌కంపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరిట‌ ఓ నియామ‌క ప‌త్రాన్ని కూడా విడుద‌ల చేశారు. 
 
వాస్త‌వానికి వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత‌గా ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి చేప‌ట్టాలి కానీ ఆయ‌న ఏపీకి అమ‌ర సంజీవ‌నీ అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ ప‌ద‌వి ఖాళీ అయింది. ఇక ఇప్పుడు ఆ ప‌ద‌వి బాధ్య‌త‌ల‌ను ఎంపీ విజ‌య‌సారెడ్డికి అప్ప‌గించారు జ‌గ‌న్.
 
ఈ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్‌కు, రాజ్యసభ, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖను అందజేశారు. విజ‌య‌సాయి రెడ్డికి వైసీపీ త‌ర‌పున పార్లమెంటరీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డంతో విజ‌య‌సాయి రెడ్డి మైలేజ్ మ‌రింత పెరిగింద‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.