విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్ కొత్త ప‌ద‌వి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 16:53:01

విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్ కొత్త ప‌ద‌వి

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొత్త ప‌ద‌వీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు...వైసీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఇప్ప‌టికే  పార్టీకి సేవ‌లు అందిస్తున్న ఆయ‌న‌కు పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు, పర్యవేక్షణ బాధ్యతలను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అందించారు.
 
దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు ..పార్టీకి ఎంతో సేవ చేస్తున్నార‌ని పార్టీలో వైయ‌స్ ఫ్యామిలీకి అండ‌గా ముందు నుంచి ఉన్నార‌ని ఆయ‌న పై ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.. వైసీపీలో ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. పార్టీలో నెంబ‌ర్ 2గా ఎదుగుతున్నారు ఆయ‌న‌. ఇక వైసీపీలో ఆయ‌న పై ఎవ‌రూ నెగిటీవ్ ప్ర‌చారం కూడా చేయ‌రు..అలాగే పార్టీలో ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.
 
ముఖ్యంగా క్రింది స్ధాయి కేడ‌ర్ ఆయ‌న ఏమి చెప్పినా వింటారు...ఇటు ఉత్త‌రాంధ్రా రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న క్రియాశీల‌కంగా ఉంటున్నారు.. దీంతో ఆయ‌న‌కు ఈ కొత్త ప‌ద‌వి ఇవ్వ‌డం పార్టీకి ఆయ‌న చేసే సేవ‌ల‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్లేలా ఉప‌యోగ‌ప‌డుతుంది అని అంటున్నారు పార్టీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.