కృష్ణప్రసాద్ కు కీల‌క ప‌ద‌వి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

vasantha krishna prasadh and ysrcp
Updated:  2018-05-15 01:10:21

కృష్ణప్రసాద్ కు కీల‌క ప‌ద‌వి

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నవంబరు 6, 2017న వైఎస్ ఆర్ క‌డ‌ప జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్రను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాలను ముగించుకుని, కోస్తా ప్రాంతాలు కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, ప‌శ్చిమ గోదావ‌రి మీదుగా కొన‌సాగుతోంది. అయితే గ‌తంలో టీడీపీ నాయ‌కులు అయ‌న అనుకూల మీడియాలు వైఎస్ జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌పాద యాత్ర కేవలం రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాల‌కే ప‌రిమితం అవుతుంద‌ని ప్ర‌చారం చేశారు.
 
అయితే ఇక వాటిని తిప్పికొట్టే విధంగా రాయ‌ల‌సీమ‌లో కంటే కోస్తా ప్రాంత ప్ర‌జ‌లే జ‌న‌నేత జ‌గ‌న్ కు అధిక సంఖ్య‌లో మ‌ద్ద‌తు తెలుప‌డంతో టీడీపీ నాయ‌కుల‌కు, చంద్ర‌బాబు ఆస్థాన మీడియాల‌కు ప్ర‌స్తుతం మింగుడు ప‌డ‌కుందిని వైసీపీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్ర‌జ‌లు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు నుంచి నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌కూ టీడీపీకి కంచుకోట‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిదే. 
 
అయితే  జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్పపాద యాత్ర‌తో  కృష్ణా జిల్లాలో అడుగు వేయ‌డంతో అక్క‌డి ప‌రిస్థితి మొత్తం తారు మారు అయింద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా టీడీపీ నాయ‌కులు ఊహించ‌ని విధంగా ప్ర‌జా స‌మ‌క్షంలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తే కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మార్చుతామ‌ని జిల్లా వాసుల‌కు జ‌గ‌న్ హామీ ఇచ్చారు. దీంతో జ‌గ‌న్ కు టీడీపీ నాయ‌కులు అధిక సంఖ్యంలో జ‌గ‌న్ కు స‌పోర్ట్ చేస్తున్నారు
 
ఇక అదే క్ర‌మంలో కృష్ణా జిల్లా నుంచి టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తుల‌, వైసీపీలోకి వ‌ల‌స‌లు విప‌రీతంగా వ‌చ్చాయి.  వారితో పాటు టీడీపీ సీనీయ‌ర్ నేత య‌ల‌మంచిలి ర‌వి, అలాగే ప్ర‌ముఖ్య పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌, తన తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో కలిసి ఈ నెల 10న జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా వైఎస్ జ‌గ‌న్,కృష్ణప్రసాద్ కు మైలవరం నియోజకవర్గ సమన్వయ కర్తగా బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు.  ఈ సంద్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, గ‌తంలో టీడీపీ అభివృద్దికోసం తాను నిరంతం కృషి చేసినా చంద్ర‌బాబు త‌న‌ను గుర్తించ‌లేద‌ని కానీ, తాను వైసీపీలోకి చేరిన నాలుగు రోజుల‌కే జ‌గ‌న్ త‌న‌ను గుర్తించి కీల‌క ప‌ద‌విని అప్ప‌జెప్పార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.అలాగే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేందు కోసం తాను నిరంత‌రం కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. 
 
ఆ త‌ర్వ‌త ఆయ‌న‌ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి, కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఇక‌ దీనికి  సంబంధించిన ప‌నుల‌ను ఆయన అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ‌ప్ర‌సాద్ ను మైల‌వ‌రం స‌మ‌న్వ‌య క‌ర్త‌గా నియ‌మించ‌డంతో వైసీపీకి మ‌రింత బ‌లం చేకూరుతుందనే చెప్పాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.