జగనే ముఖ్యమంత్రి.. అని సంకేతాలు ఇస్తున్న బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-30 11:50:37

జగనే ముఖ్యమంత్రి.. అని సంకేతాలు ఇస్తున్న బాబు

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న‌ట్లు ఉంది  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజ‌యం త‌మ‌దేన‌ని ఇప్ప‌టి నుంచే బాజాలు వాయిస్తోంది టీడీపీ.గ‌త ఎన్నిక‌ల్లో తప్పుడు హామీలతో ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి అధికారంలోకి వ‌చ్చిన బాబు.ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కి ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఏపీలో అధికార పార్టీపై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు పూర్తి వ్య‌తిరేక‌త పెరుగుతోంది. హామీల‌ను తీర్చ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు టీడీపీ నేత‌ల‌ను ఛీ కొడుతున్నారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల సంగ‌తి ఏంటీ అని బాబును ప్రశ్నిస్తే. కేంద్రం నిలువునా ముంచిందని, కేంద్రం మోసం చేసిందని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేసిందని చెప్తున్నారు తప్ప, కేంద్రం కంటే ముందు ప్రజలను మోసం చేసింది నేనే అని చెప్పడం లేదు చంద్రబాబు..అధికారం కోసం ఇచ్చిన 600 హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆ నెపాన్ని కేంద్రంపైకి తోసి మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు... 
 
ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు ప్రారంభించారు సీఎం చంద్ర‌బాబు. దానిలో భాగంగా ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మం, మినీ మహానాడులు నిర్వహించారు. ఇంటింటికి టీడీపీ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రజలు దగ్గరికి వెళ్లిన టీడీపీ నాయకులకు చుక్కలు చూపించారు ప్రజలు, ఈ గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌లో ఒక్క‌టైనా నెర‌వేర్చారా. ఏందుకు ఓటేయ్యాలో చెప్పండంటూ టీడీపీ నేత‌ల‌ను ప్ర‌జ‌లు నిల‌దీసి ప్ర‌శ్నిస్తున్నారు...ఇక మినీ మహానాడులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతలు వాళ్లకు వాళ్లే గొడవలు పడడంతో మినీ మహానాడు ఫెయిల్ అయ్యింది... దీంతో ప్ర‌జ‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియ‌క అక్క‌డ నుంచి జారుకుంటున్నారు టీడీపీ నేత‌లు. 
 
మరో వైపు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ టీడీపీపైన విరసికుపడుతున్నారు...ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా టీడీపీ ఎలా మోసం చేస్తుందో రోజు ఒక కథతో ప్రజలకు వివరిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి...ఈ సంకల్పయాత్రకి అన్ని వర్గాల నుండి మద్దతు రావడంతో చంద్రబాబు భయపడుతున్నారు..మరో వైపు ప్రజల్లో కూడా రోజు రోజుకు టీడీపీపైన వ్యతిరేకత పెరిగిపోతుంది..
 
ఇది ఇలా ఉంటె వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో తామే గెలుస్తామ‌ని ప‌లుమార్లు వ్యాఖ్యానించారు, మేము వేసిన రోడ్లపై తిరగొద్దు అంటారు, ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనగలను అన్నారు, బ్రిటిష్ వారితో పోరాటం చేసిన పార్టీ టీడీపీ అంటారు, 1932 లో మొదలయిన బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కట్టింది నేనే అంటారు...ఇలా ఒకటా రెండా మీటింగ్ పెట్టినప్పుడల్లా ఎదో ఒక వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు...
 
ఈ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు ఓడిపోతామనే భయం వేసిందా అనే అనుమానం రాక మానదు...ఈ భయానికి కారణం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, లేక ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి... ఏ రెండింటిలో దేన్నీ చూసి చంద్రబాబు భయపడుతున్నారు...40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న బాబుకు ఇది తెలుసుకోవడం పెద్ద లెక్క కాదు...వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని పసిగట్టిన బాబు అందుకే ఒత్తిడిలో ఎదో మాట్లాడుతున్నారు...ఇదంతా చూస్తుంటే ఇన్ డైరెక్ట్ గా జగనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు చంద్రబాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.