వైసీపీకి బ్రోకర్ల దెబ్బ జ‌గ‌న్ మేల్కోకపోతే క‌ష్టం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and ycp
Updated:  2018-08-11 15:47:44

వైసీపీకి బ్రోకర్ల దెబ్బ జ‌గ‌న్ మేల్కోకపోతే క‌ష్టం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు బ్రోకర్ల దందా మొదలైనట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొంతమంది తమ దందాను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పార్టీలో యాక్టివ్ గా కనిపిస్తూనే మరోవైపు తమ వ్యక్తిగత స్వార్థంతో, పార్టీ టికెట్ల ఆశతో అయిన కాటికి డబ్బులు తీసుకుంటూ కొంతమంది దందాల‌ను నడిపిస్తున్నార‌ని తెలుస్తోంది. టికెట్ విషయంలో లాబీయింగ్ అంటూ వీళ్లు తమ దందాను నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో ఇలాంటి దందాలు నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
అందుకు ఉదాహరణ ప్రకాశం జిల్లా ఇక్కడ జరుగుతున్న బ్రోకర్ల దందాను ప్రస్తావించుకోవచ్చు. ఇక్కడ కొంతమంది పార్టీ ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దగ్గర తమ దందాను నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కిరెడ్డి, అశోక్, కందుకూరు శేషా రెడ్డి, కందుకూరు కొండారెడ్డి అనే స్థానికులు ప్రకాశం జిల్లాలో టికెట్ ఆశావహుల వద్ద దందా సాగిస్తున్నట్టుగా సమాచారం.
 
తాము జిల్లా ముఖ్య నేతలకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందిస్తూ ఉంటామని, తమకు డబ్బులు బాగా ఇస్తే జిల్లా నాయకత్వానికి పాజిటివ్ రిపోర్టులు ఇస్తామని.. ఒకవేళ తమకు డబ్బులు ఇవ్వకపోతే మీ పని తీరు బాగోలేదని రిపోర్టు ఇస్తామని వీళ్లు ఆశావహులను డైరెక్టుగా బెదిరిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు సాక్షి పత్రికలో పని చేస్తున్న బ్యూరో రమన రెడ్డి కూడా ఇలానే చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. తనకు అనుకూలంగా లేకపోతే సాక్షి పత్రికలో కవర్ చేయకపోవడం.. తన పరిచయాలను ఉపయోగించుకుంటూ ఇతర పత్రికల్లో నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చేలా చేస్తున్నారనే మాట వినిపిస్తోంది.  
 
దీని వల్ల పార్టీలో కొంత అభద్రతా భావం ఏర్పడుతోంది. వీళ్లంతా తమకు డబ్బులిస్తే చాలు  పనితీరు ఏ మాత్రం బాగోలేకపోయినా..వాళ్ల గురించి పాజిటివ్ రిపోర్టులు ఇస్తారు. ఒక వేల తమకు డబ్బు లివ్వకపోతే మీ గురించి నెగిటివ్ రిపోర్టులు ఇస్తామంటూ బెదిరింపులు సాగుతూ ఉన్నాయి. పార్టీ కార్యకర్తలుగా చలామణి అవుతున్న వీళ్లు, జిల్లా నాయకత్వంతో పరిచయాలు కలిగిన వాళ్లు ఇలాంటి దందాలను చేస్తున్నారు. దీని వల్ల నష్టం జరిగేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పక తప్పదు.
 
కేవలం ప్రకాశం జిల్లా అనే కాదు.. ఇలాంటి దందాలు ఇతర జిల్లాల్లో కూడా సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి గురించి అర్థంచేసుకోవాల్సిన బాధ్యత, ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వైసీపీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. దీనిపై అధినాయకత్వం ఇన్ చార్జిలతో మాట్లాడితే మొత్తం వ్యవహారంపై స్పష్టత రావొచ్చు. లేక పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి ప్ర‌భావం జ‌గ‌న్ కు తీవ్రంగా త‌గులుతుంద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments