జగన్ మరో కీలక నిర్ణయం.. చంద్రబాబు కు ముచ్చెమటలు..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan and babu
Updated:  2018-10-22 16:25:36

జగన్ మరో కీలక నిర్ణయం.. చంద్రబాబు కు ముచ్చెమటలు..

వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే ఎపి లో గెలవడానికి చాల కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ తెలంగాణలో ఎన్నికలు ముగిసేంత వరకూ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబరు 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11వ తేదీన కౌంటింగ్ ను నిర్వహిస్తారు. అప్పటి వరకూ పాదయాత్రలోనే ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి తెలంగాణ లో ఎన్నికలకు జగన్ పాదయాత్ర కి సంభంధం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..
 
తెలంగాణ లో ఎన్నికలు అయిపోయేంతవరకు పాదయాత్రలోనే ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన రూట్ మ్యాప్ లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పేరుతో గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి 11 నెలలు పూర్తయింది. ముందుగా అనుకున్న ప్రకారం యాత్రను నవంబరు 5వ తేదీకి ముగించాలి. దీనివల్ల ఏడాది పాటు ప్రజల్లో ఉన్నట్లు ఉంటుందని యాత్రను అలా ప్లాన్ చేశారు. అయితే యాత్రకు ప్రతి జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది. మరోవైపు పండగలు, తుఫాను ల వంటి సమయంలో యాత్రకు విరామమివ్వాల్సి వచ్చింది.
 
అంతేకాకుండా మరోవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. పూర్త