టీడీపీ, కాంగ్రెస్ పొత్తు తో జగన్ గెలుపు ఖాయం.. సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-11-02 01:25:10

టీడీపీ, కాంగ్రెస్ పొత్తు తో జగన్ గెలుపు ఖాయం.. సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసి నడవాలని డిసైడ్ అయిపోయాడు. ఏ కాంగ్రెస్ మీద అయితే ప్రజలు కోపం తో రగిలి పోతున్నారో వారి తోనే బాబు దోస్తీ కట్టడం ఆంధ్ర ప్రదేశ్ లో అనూహ్య మార్పులకు కారణం అవుతుంది. టీడీపీ , కాంగ్రెస్ పొత్తు ఆంధ్ర లో జగన్ కు అఖండ విజయాన్ని చేకూర్చుతుందని ఓ సర్వే బల్లగుద్ది మరీ చెప్తుంది.. ఇంతకీ ఏంటా సర్వే.. ఆ సర్వే వివరాలు ఇప్పుడు చూద్దాం.. 
 
టీడీపీ, కాంగ్రెస్ తో చేరడం వైసీపీ కి కలిసొస్తుంది.. ఇటీవలే జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా  చంద్రబాబు కాంగ్రెస్ తో చెయ్యి కలిపి బిజెపి ని కూలడాన్నే ప్రయత్నం చేస్తుండగా ఆ కలయిక టీడీపీ కి పెద్ద మైనస్ గా కాబోతుందని లగటి పాటి బాబుకు చెప్పినట్టు సమాచారం... అయితే నిజానికి, చంద్రబాబు డీఎన్‌ఏలో కాంగ్రెస్‌ పార్టీ జాడలు కన్పిస్తాయి.
 
ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్‌ పార్టీ నుంచి. ఆ తర్వాతే ఆయన టీడీపీలోకి వచ్చారు. పిల్లనిచ్చిన మామ నందమూరి తారకరామారావుని రాజకీయంగా వెన్నుపోటు పొడిచి, టీడీపీ పగ్గాలు లాక్కున్న చంద్రబాబు.. ఆ పార్టీని భ్రష్టుపట్టించేయడంలో శక్తి వంచన లేకుండా కృషిచేశారు.