2019లో ఆ రెండు జిల్లాలే జ‌గ‌న్ ను సీఎం చేస్తాయి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 18:00:15

2019లో ఆ రెండు జిల్లాలే జ‌గ‌న్ ను సీఎం చేస్తాయి

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయ్యారంటే దానికి కార‌ణం  కేవ‌లం పశ్చిమ గోదావ‌రి జిల్లా, తూర్పు గోదావ‌రి జిల్లాలే కార‌ణమ‌ని చెప్పాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల‌ రాజ‌కీయం ఒక ఎత్తు అయితే, ఈ రెండు జిల్లాల రాజ‌కీయం మ‌రో ఎత్తు. ప్ర‌జ‌లంద‌రూ రాజ‌కీయ నాయ‌కుల‌ను చూసి ఓటు వేస్తే, ఈ రెండు జిల్లాల ప్ర‌జ‌లు మాత్రం ఫ్యూచ‌ర్ లో ఆయా పార్టీ నాయ‌కుల‌కు ఓటు వేస్తే త‌మ జిల్లాను అభివృద్ది చేస్తారా లేదా అని ఆలోచించి నాయ‌కులను ఎన్నుకుంటారు.
 
వారిని ఎన్నుకున్న త‌ర్వాత ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో అభివృద్ది చేయ‌క‌పోతే ప్ర‌జ‌లంద‌రూ ఏక‌మై ఆ పార్టీ నాయ‌కుల‌ను సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ ఓటుతో బుద్ది చెబుతారు. అయితే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇదే ప‌రిస్థితి త‌లెత్తే అవ‌కాశం నూటికి నూరు శాతం క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకుంటే గ‌డిచిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయుడు సుమారు ఆరు వంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న‌ ప్ర‌క‌టించిన హామీల‌ను రాష్ట్ర‌ప్ర‌జ‌లంద‌రూ స్వీక‌రించి చంద్ర‌బాబుకు అధికార ప‌గ్గాల‌ను అప్ప‌గించారు
 
అయితే ఆయ‌న‌ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్నా ఇంత వ‌ర‌కూ ఒక్క హామీను కూడా అమ‌లు చేయ‌లేదు. ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీల్లో నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు, రైతుల‌ రుణ‌మాఫీ, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ, ఒక చివ‌రిగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం వంటి వాటిని ప్ర‌క‌టించారు. కానీ ముఖ్య‌మంత్రి ఇంత‌ర‌వ‌కూ వాటి ప్ర‌స్తావ‌న‌ తీసురాలేదు
 
ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం. ఈ ప్రాజెక్ట్ ను చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే ఖచ్చితంగా పూర్తిచేస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ ఇంత‌వ‌ర‌కూ ఈ విష‌యంపై ముఖ్య‌మంత్రికి ఉలుకూ ప‌లుకు లేదు. దీంతో ఉభ‌య గోదావ‌రి ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై గుర్రున ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కు త‌గిన శాస్తి చేయాల‌ని చూస్తున్నారు.
 
ప‌శ్చిమ‌లో 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే  2014 ఎన్నిక‌ల్లో అన్ని అసెంబ్లీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో సుమారు 15 అసెంబ్లీ స్థానాల‌ను టీడీపీ కైవ‌సం చేసుకుని అధికారంలోకి వ‌చ్చింది. అయితే ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితిల్లో గ‌త‌ ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల నుంచి ఏ విదంగా వైసీపీ ఘోర వైఫ‌ల్యం చెందిందో ఇక 2019 వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా ఇదే ఫ‌లితాల‌ను ఇచ్చేందుకు ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.