ఆనం కి జగన్ హామీ... కంగుతిన్న టీడీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-21 18:25:33

ఆనం కి జగన్ హామీ... కంగుతిన్న టీడీపీ

టీడీపీ అధికారంలోకి వచ్చాక, అధికార మదంతో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలనీ భావించి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో సుమారు 23 మంది ఎమ్మెల్యేలను మభ్య పెట్టి పార్టీ ఫిరాయించేలా చేశారు..రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కూడా కేటాయించారు... కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంత మంది పార్టీ ఫిరాయించిన ఐ డోంట్ కేర్...ప్రజల మద్దతు మా పార్టీకి ఉంది అని మొక్కొఓని దీక్షతో ముందుకు సాగుతున్నారు.. 
 
ఈ క్రమంలోనే పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరియు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సుమారు 3000 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి పూనుకున్నారు జ‌గ‌న్.నవంబర్ 6న ప్రారంభమయిన ఈ ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటివరకు ఆరు నెలలపాటు సాగి 2600 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. జగన్ చేస్తున్న పాదయత్ర జనసంద్రంగా మారుతుండ‌డంతో వైసీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి... ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో ...టీడీపీ కోట్ల రూపాయలు ఆశ చూపి ఫిరాయించేలా చేస్తే, ప్రజలు జగన్ కి ఇస్తున్న మద్దతును చూసి స్వచ్చందంగా వైసీపీలోకి నాయకులు క్యూ కడుతున్నారు.
 
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి జగన్ ని లోటస్ పాండ్ లో కలిశారు...ఈ భేటీతో ఆనం వైసీపీలోకి రావడం ఖాయం అని తెలుస్తుంది...ఈ మేరకు జరిగిన భేటీలో జగన్, ఆనం కి ఒక హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆనం రాంనారాయణ రెడ్డి తనకి, తన అన్న కుమారుడికి సీటు ఇవ్వమని కోరినట్టు సమాచారం...దీనికి జగన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం..
 
కానీ ఆనం కోరినట్టు ఆత్మకూరులో కాకుండా వేంకటగిరి నుండి పోటీ చేయమని చెప్పారట జగన్...దానితో పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలను కూడా ఆనంని చూసుకోమని చెప్పారని విశ్వసనీయ వ‌ర్గాల‌ సమాచారం.నెల్లూరులో పార్టీని బలోపేతం చేసి టీడీపీని అన్ని చోట్ల ఓడించాలని ఆనంకు సూచించారట జగన్. ఆనం వైసీపీలో చేరితే నెల్లూరు జిల్లాలో టీడీపీ గల్లంతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.