బ్రాహ్మ‌ణుల‌కు జ‌గ‌న్ హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-09-10 05:39:08

బ్రాహ్మ‌ణుల‌కు జ‌గ‌న్ హామీ

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మ‌ణుల‌ను మోసం చేశార‌ని ఏపీ ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. తాజాగా విశాఖ ప‌ట్నంలో బ్రాహ్మ‌ణుల సంఘాల‌తో స‌మావేశం అయిన జ‌గ‌న్... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు అధికార దాహంతో బ్రాహ్మ‌ణుల‌కు అనేక హామీల‌ను ఇచ్చార‌ని కానీ ఆయ‌న ఒక్క హామీను కూడా అమ‌లు చెయ్య‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. 
 
అంతేకాదు అధికార‌ బ‌లంతో చంద్రబాబు నాయుడు దుర్గ‌మ్మ‌గుడి ఆల‌య పరిధిలో ఉన్న 11 ఎక‌రాల‌ను  సిద్దార్థ కాలేజీకి అప్ప‌గించ‌డం దారుణం అని అన్నారు. టీడీపీ నాయ‌కులకు దేవాలయాలు అన్నా దేవుళ్లు అన్ని భ‌యం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దేవాల‌యాల‌కు సంబంధించి ప‌నుల‌ను చెయ్యాలంటే ఎంత‌టి అన్యాయ‌స్తుడు అయినా అవినీతికి పాల్ప‌డితే దేవుడు శిక్షిస్తాడు అని భ‌యంతో స‌క్ర‌మంగా ప‌నుల‌ను చేస్తార‌ని అలా కాకుండా గోదావ‌రి పుష్క‌రాలు, కృష్ణాన‌ది పుష్క‌రాలు అని పేరు చెప్పి ఏకంగా మూడు వేల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డార‌ని జ‌గన్ ఆరోపించారు. 
 
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల్లో కుల‌,మ‌త భేదం లేకుండా ప్ర‌తీ ఒక్క‌రికి  వ‌ర్తిస్తాయ‌ని, రాష్ట్రంలో ఉన్న ప్ర‌తీ ఒక్క బ్రాహ్మ‌ణ ముఖంలో చిరున‌వ్వు చూస్తాన‌ని జగ‌న్ హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.