ఆ ఒక్క హామీతో ఉద్యోగ‌స్తుల ఓట్ల‌న్ని జ‌గ‌న్ కే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-03 12:13:12

ఆ ఒక్క హామీతో ఉద్యోగ‌స్తుల ఓట్ల‌న్ని జ‌గ‌న్ కే

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ సంకల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం హాజ‌రై జ‌న‌నేత‌ జ‌గ‌న్ కు జేలులు ప‌లుకుతున్నారు.
 
అధికార బ‌లంతో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ, మ‌రికొద్ది రోజుల్లో రాజ‌కీయ అవినీతిని అరిక‌ట్టేందుకు వైసీపీ కంక‌ణం క‌ట్టుకుంద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ ఒక్క పేద‌వాడి ముఖంలో చిరున‌వ్వు తీసుకువ‌స్తాన‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇస్తున్నారు. 
 
పాద‌యాత్ర‌లో అడుగ‌డుగునా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున  జ‌గ‌న్ కు ఫిర్యాదులు అందిస్తున్నారు. రైతులు, మ‌హిళ‌లు, అంగ‌న్ వాడి టీచ‌ర్స్, వ్యాపార‌స్తులు, ఉద్యోగ‌స్తులు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న ప్ర‌తీ ఒక్కరికి టీడీపీ ప‌రిపాల‌న‌లో స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌ని జ‌గ‌న్ కు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
 
ఇదే క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకునేందుకు ఏపీ సీపీఎస్ నేత‌లు వ‌చ్చారు. పాద‌యాత్ర‌లో వారిని గ‌మ‌నించిన జ‌గ‌న్ త‌న సిబ్బంది స‌హ‌కారంతో ఏపీ సీపీఎస్ నేత‌ల‌ను ద‌గ్గ‌ర‌కు పిలిపించుకుని వారి ఫిర్యాదును ఏంటో అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఏపీ సీపీఎస్ నేత‌లు త‌మ ఫిర్యాదును వివ‌రిస్తూ, త‌మ‌కు సీపీఎస్ విధానం వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని ఈ విధానాన్ని ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్ ను కోరారు. 
 
ఇక వెంట‌నే స్పందించిన వైఎస్ జ‌గ‌న్ వైసీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని వెంట‌నే ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ఏపీ సీపీఎస్ నేత‌లంద‌రు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులమంతా క‌లిసిక‌ట్టుగా పని చేస్తామ‌ని హామీ ఇచ్చారు. సో... ఏపీలో ఉన్న  ప్రభుత్వ ఉద్యోగులంద‌రూ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఖాయం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.