జ‌గ‌న్ పిలుపుకు ముందుకొస్తున్న‌ ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-25 13:28:19

జ‌గ‌న్ పిలుపుకు ముందుకొస్తున్న‌ ఎమ్మెల్యేలు

కొద్ది కాలంగా ఎడ‌తెరుపులేకుండా కేర‌ళలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రం అత‌లా కుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే. అయితే వారికి నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల రిత్య ఏపీ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ త‌ర‌పున విరాళంగా కోటి రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయ‌కులు అభిమానులు అంద‌రు క‌లిసి త‌మ‌వంతు కృషిగా కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు విరాళాలను ప్ర‌క‌టించాల‌ని పిలుపునిచ్చారు 
 
ఇక ఆయ‌న ఆదేశాల మేరకు న‌గ‌రి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా 14 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను 150 ట‌న్నులు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అయిన బియ్యం కందిప‌ప్పు, అలాగే మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను కేర‌ళకు పంపించారు. ఇక ఇదే క్ర‌మంలో నెల్లూరు ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కేఎంసీ క‌న్‌స్ట్రక్ష‌న్‌ కంపెనీ ఎండీ మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ముందుకు వ‌చ్చారు.
 
కేర‌ళ బాధితుల‌కు స‌హాయంగా కోటి రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు. ఈ విరాళాలాన్ని కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి కింద గౌత‌మ్ రెడ్డి అంద‌జేయ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ నెల 28,29 తేదిల‌లో తాను స్వ‌యంగా కేర‌ళకు వెళ్లి ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ను క‌లిసి డీడీని అంద‌జేసి వ‌ర‌ద బాధితుల పున‌రావాసం, ఇత‌ర కార్య‌క్ర‌మాల కోసం వినియోగించుకోవాల‌ని తాను కోరుతాన‌ని స్ఫ‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.