జ‌గ‌న్ జోకులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-12 16:36:56

జ‌గ‌న్ జోకులు

రాజ‌కీయాల్లో అయినా ఇంటి వ్య‌వ‌హారాల్లో అయినా మ‌నం చేసిన‌వి- చేయ‌బోయేవి  మాత‌మ్రే చెప్పాలి... ఫ్యూచ‌ర్ ప్లాన్ లేకుండా గొప్ప‌ల‌కు పోయి ప‌క్క‌వాడి మీద ఆధార‌ప‌డితే ఇప్పుడు ఏపీ ప‌రిస్దితి ఎలా ఉందో అలానే ఉంటుంది..
 
అత్యంత సీనియ‌ర్ అని చెప్పుకునే సీఎం చంద్ర‌బాబు అత్యంత ఈజీగా ఈ విష‌యంలో ఇరుక్కున్నారు.. వాట్ అయామ్ సేయింగ్ ఎవ్రీ థింగ్ క్లియ‌ర్ అని,2014 ఎన్నిక‌ల్లో  బీజేపీకి ఓట్లు తెలుగుదేశానికి ఓట్లు వేయించారు మోదీ -బాబు ప‌వ‌న్ త్ర‌యం..ఇక సింగిల్ గా అయినా జ‌గ‌న్ 67 సీట్లు గెలుచుకుని ఓ ప్ర‌శ్నార్ధ‌క‌మైన ఎన్నిల‌ను వీరికి  రుచి చూపించాడు..
 
అయితే వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర మంచి చోలోక్తులు క‌థ‌లు సామెత‌లు పోయెమ్స్ తో ముందుకు వెళుతోంది. ఇటు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా మాట్లాడ‌టంలో ఇప్పుడు కేసీఆర్ ముందు ఉంటే, ఆ త‌ర్వాత జ‌గ‌న్ అన‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు... మీడియా కూడా ఎక్కువ సేపు జ‌గ‌న్ స్పీచ్ కు ప్ర‌యారిటి ఇస్తుంది అంటే ప్ర‌జ‌లు విన‌డాన‌కి చూడ‌టానికి ఆస‌క్తి చూపుతున్నారు అని అర్దం.
 
అయితే చంద్ర‌బాబు మాత్రం మ‌న‌కి అన్యాయం జ‌రిగింది, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ,మన స‌త్తా చూపించాలి, తీర్మానాలు చేస్తున్నాం.. కేంద్రం పై పోరాడుతున్నాం.. ఇదే మూస‌ప‌ద్ద‌తిలో 1980 టేపురికార్డ‌ర్ల వాద‌న వినిపిస్తే ప్ర‌జ‌లు న‌మ్మ‌రు అలాగే ఉంది బాబు మాట‌.. అయితే జ‌గ‌న్ మాత్రం త‌న పోరాటం కొత్త విధానాల‌తో తీసుకుపోతుంటే చంద్ర‌బాబు మాత్రం బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చూపిస్తున్నారు.
 
ఓప‌క్క జ‌గ‌న్ మంచి మంచి క‌థ‌లు చెబుతూ ప్ర‌జల్లో స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతుంటే, ఆ నాడు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం చీక‌టి ఒప్పందాలు బ‌య‌ట‌పెడుతుంటే, చంద్ర‌బాబు ఆయ‌న మంత్రి వ‌ర్గం ఎమ్మెల్యేలు క‌లిసి ల‌క్ష కోట్లు ల‌క్ష కోట్లు అని జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు మాత్రం చేస్తున్నారు.... మ‌రోసారి అంద‌రూ గ‌మనిస్తున్నారు అనే సోయ లేదు ఈ నాయ‌కుల‌కు.
 
అస‌లు 1300 కోట్ల రూపాయ‌ల అభియోగాలు జ‌గ‌న్ పై ఉన్నాయి.. అందులో  500 కోట్ల రూపాయ‌లు వీగిపోయాయి అనేది అంద‌రికి తెలుసు..  18 స్టేలు తెచ్చుకున్నాం, నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు విమ‌ర్శిస్తున్నారు అనే క్లారిటీలేదు... ఓప‌క్క జ‌గ‌న్ పాద‌యాత్ర స‌భ‌ల్లో చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆడికారు ఇంటికి కిలో బంగారు ఓటుకు మూడు వేల నుంచి ఐదు వేలు ఇలా ప్ర‌శ్న‌లు చ‌లోక్తులు జోకులు పేల్చుతుంటే మీరేమో ల‌చ్చ కోట్లు అన‌డం బాగుంది... అస‌లు మీరు చేసే కామెంట్లు ప‌స‌లేదు అని, అంతా న‌స అని అంద‌రికి తెలిసిపోతోంది. 
 
త‌మ్ముల్లు ప్లాన్ మార్చండి. మీ ల‌చ్చ కోట్లు అనే మాట మీకే గుదిబండ‌గా మారిపోతోంది... వైసీపికే కాదు ఏపీ ప్ర‌జ‌ల‌కు కూడా చిరాకెత్తోందిక్క‌డ 
 
విశ్లేష‌ణ !! గ‌ణేష్. వి

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.