12న జ‌గ‌న్ కీల‌క స‌మావేశం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-07 12:47:24

12న జ‌గ‌న్ కీల‌క స‌మావేశం

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట విశాఖ‌ప‌ట్నంలో నిర్విరామంగా  కొన‌సాగుతోంది. పేరుకు మాత్ర‌మే టీడీపీ కంచుకోట అయినా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఈ జిల్లాలో అడుగు పెట్టగానే ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం హాజ‌రై జ‌న‌నేత‌కు జేజేలు ప‌లుకుతున్నారు.
 
ఒక ప‌క్క ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ మ‌రో ప‌క్క 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గన్. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో ఇచ్చిన హామీల‌ను ఏ ఒక్క‌టి పూర్తిగా అమ‌లు చెయ్య‌లేద‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు జ‌గ‌న్. ఇక చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌ను గ్ర‌హించిన రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ త‌మ బ్ర‌తుకులు బాగుప‌డాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని భావిస్తున్నారు. 
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ఈ నెల 12వ తేదిన ముస్లింల‌తో స‌మావేశం కానున్నారు. విశాఖ‌లో ముస్లిం జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్, టీడీపీ హ‌యాంలో వారికి జ‌రిగిన‌ అన్యాయాన్ని వివ‌రించ‌నున్నారు. అంతేకాదు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 2014లో ముస్లింల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోగా తిరిగి కొత్త‌గా  వారిని మ‌భ్య‌పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక వాట‌న్నింటిని తిప్పికొట్ట‌డానికి జ‌గ‌న్ ఈ నెల‌12న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముస్లింలతో స‌మావేశం కానున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.