జ‌గ‌న్ మాస్టర్ ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-30 11:49:46

జ‌గ‌న్ మాస్టర్ ప్లాన్

గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయిన ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా సంవత్సరం మాత్రమే ఉండడంతో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల‌కు సన్నద్ధమవుతోంది వైసీపీ.జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలనీ పార్టీ నేతలకు సూచించారు...
 
ఈ మేర‌కు ప్ర‌ముఖ వ్యూహాక‌ర్త  ప్రశాంత్‌ కిశోర్ ను వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించిన జ‌గ‌న్, ఆయ‌న సలహా, సూచనల ప్రకారం ముందుకు వెళ్తున్నార‌నేది తెలిసిన విష‌య‌మే. వైసీపీ వ్యూహాక‌ర్త‌గా బాధ్య‌త‌లు అందుకున్న పీకే , వైసీపీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి  తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహార‌చ‌న‌లు చేస్తున్నారు. త‌న టీమ్ తో క‌లిసి భారీ ప్లాన్ లు రూపొందిస్తున్నారు పీకే. నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌పై త‌న టీమ్ తో స‌ర్వేలు చేయించి ఆర్థికంగా, సామాజికంగా బ‌లంగా ఉన్న స‌మ‌ర్థ‌వంత‌మైన నేత‌ల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు క‌ట్ట‌బెట్టాల‌ని జ‌గ‌న్ కు సూచించారు ప్ర‌శాంత్ కిషోర్. వైసీపీలో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి, ఎవ‌రికి పార్టీ ప‌ద‌వులు ఇవ్వాల‌ని అనే దానిపై స‌ర్వేలు చేయించి జ‌గ‌న్ కు రిపోర్టులు అందిస్తుంది పీకే టీమ్. 
 
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రశాంత్ కిషోర్ రిపోర్టులను ఆధారంగా చేసుకొని అక్కడక్కడా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు...ఆలా చేయడం వల్ల టికెట్ సొంతం చేసుకున్న నేతలు ప్రజల్లో ఉంటూ, వ్యూహాలు రచించుకొని, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది.
 
అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న వైఎస్ జ‌గ‌న్ మ‌రో న‌యా ప్లాన్ రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. సీనియ‌ర్ల‌ను పార్టీ కోసం ఉప‌యోగించుకుకోవాల‌నే ఆలోచ‌న‌కు జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం...సీనియ‌ర్లే టార్గెట్ గా జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అమ‌లు చేయ‌ని మాస్టర్ ప్లాన్ ను త‌యారుచేసిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అది ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వారితో పాటు, పోటీకి దూరంగా ఉన్న సీనియర్లకు బాధ్యతలు అప్పగించి, వాళ్ళకున్న అనుభవాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారంట జగన్... 
 
ఈ నిర్ణయంతో పార్టీ భూతు స్థాయిలో బలోపేతం అయ్యేందుకు మ‌రింత  అవకాశం వుంటుందనేది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం వున్నవారితో పాటు, ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లును పార్టీ కార్యకలాపాల నిర్వహణలో నియమించనున్నట్టు సమాచారం. అలాగే పార్టీ నియోజవర్గం సమవన్వయకర్తలుగా పనిచేస్తున్న వారిపై ప్రశాంత్ కిషోర్ జరిపిన సర్వేల ప్రకారం సమర్థులైనవారిని ప్రస్తుతానికి సమన్వయకర్తలుగా కొనసాగిస్తూనే ఆశించిన స్థాయిలో పనితీరు కనపరిచిన వారికీ సీటు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేత‌ల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి తీసుకురావాల‌నే లక్ష్యంతోనే ఒకవైపు మాస్టర్ ప్లాన్ ని రచిస్తూ, మరో వైపు ప్రజాసంకల్ప యాత్రలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి...ఈ ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.