కాసేప‌ట్లో వైసీపీ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 03:21:08

కాసేప‌ట్లో వైసీపీ కీల‌క నిర్ణ‌యం

ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ సాయంత్రం పార్టీ ముఖ్య‌నేత‌లతో  భేటీ కానున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్ధితులతో పాటు కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఏ విధంగా ముందుకు సాగాలి అనే  దానిపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. 
 
హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాన్ని మ‌రింత ఉదృతం చేసే దిశ‌గా కార్య‌చ‌ర‌ణ రూపొందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప‌లు కీల‌క విష‌యాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. జిల్లాలోని క‌లిగిరి మండ‌లం పెద్ద కొండూరులో పాద‌యాత్ర శిబిరం వ‌ద్ద ఈ మీటింగ్ జ‌ర‌గ‌నుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.