రాజ‌కీయ పార్టీల‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 06:19:32

రాజ‌కీయ పార్టీల‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌లు

వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న మేర‌కు పార్ల‌మెంట్ లో అవిశ్వాసానికి టీడీపీని  ఒప్పించాల‌ని ప‌వ‌న్ కు సూచించారు  వైసీపీ సినియ‌ర్ నేత, ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి. మాకున్న బ‌లం స‌రిపోదు....టీడీపీ మాతో క‌లిసి వ‌స్తుందో...లేదో  చెప్పాల‌ని  పెద్ది రెడ్డి డిమాండ్ చేశారు. 
 
మోదీకి భ‌య‌ప‌డి చంద్ర‌బాబు మాట్లాడ‌టం లేద‌ని, కేసుల  భ‌యం కార‌ణంగానే బాబు అవిశ్వాసానికి ముంద‌కు రావ‌డం లేద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. అవిశ్వాసం విష‌యంలో చంద్రబాబు వైఖ‌రి ఏంటో చెబితే ఇత‌ర రాజ‌కీయ ప‌క్షాల‌తో సంప్ర‌దిస్తామ‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే దేశంలోని ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో మ‌ద్ద‌తు కోసం జ‌గ‌న్ మాట్లాడ‌తార‌ని, అవిశ్వాసం ప్ర‌వేశ‌పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో స‌హా ఎవ‌రు  మ‌ద్ద‌తు ఇచ్చినా తీసుకుంటామ‌ని  ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
నిజంగానే వైయ‌స్ జ‌గ‌న్ దేశంలో ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌తో అవిశ్వాసంపై చ‌ర్చ‌లు జ‌రిపితే తెలుగుదేశం పార్టీకి షాక్ త‌ప్ప‌ద‌నే చెప్పాలి. మ‌రోవైపు హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే వ్యూహ ర‌చ‌న‌లు మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ నిజంగా కాంగ్రెస్ పార్టీతో క‌లిసి కేంద్రంపై యుద్దం చేస్తారా...లేదా అనేది చూడాలి.

షేర్ :

Comments

1 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.