జ‌గన్ మ‌రో హామీ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan promise to bc community
Updated:  2018-04-09 12:33:30

జ‌గన్ మ‌రో హామీ?

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తల‌పెట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం నాయ‌కులు కంచుకోట అయిన గుంటూరు జిల్లా తెనాలి సెగ్మెంట్ లో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ఈ పాద‌యాత్ర‌కు అడుగ‌డునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు...
 
గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాలుగా అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకుసాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో బీసీ-సీ క్రైస్త‌వుల సంఘ స‌భ్యులు జ‌న‌నేతను క‌లిసేందుకు వ‌చ్చారు... తాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టినుంచి  కష్టాల‌ను అనుభ‌విస్తూనే ఉన్నామ‌ని జ‌గ‌న్ తో క్రైస్త‌వులు త‌మ బాధ‌ను తెలుపుకున్నారు...
 
గ‌తంలో ఈ స‌మ‌స్య‌ల‌ను అనేక సార్లు ప్ర‌భుత్వ దృష్టికి తీసుకువెళ్లితే, మీరు టీడీపీకి ఓటు వేయ‌లేద‌ని అందుకు మీకు ఎలాంటి ప‌నులు చేయ‌మ‌ని అంటున్నార‌ని జ‌గ‌న్ తో వారుత‌మ ఆవేద‌న‌ను చెప్పుకున్నారు... గ‌తంలో కూడా రాజశేఖరరెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించార‌ని గుర్తు చేశారు.
 
మీరు కూడా మీ నాన్న‌గారిలాగా స్పందిస్తార‌ని ఆశ‌తో మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చామ‌ని క్రైస్త‌వ సంఘ స‌భ్యులు అన్నారు.. అయితే ఈ విష‌యంపై జ‌గ‌న్ స్పందించారు... తాము అధికారంలోకి రాగానే ప్ర‌తీ ఒక్క క్రైస్త‌వ‌కుటుంబానికి అండ‌గానిలుస్తామ‌ని వారికి భ‌రోసా ఇచ్చారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.