చంద్ర‌బాబుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-08-20 11:49:48

చంద్ర‌బాబుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌వాల్

గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతంలో గ‌నుల దోపిడీ కేసును రాష్ట్ర  ప్ర‌భుత్వం సీఐడీకి అప్ప‌గించ‌డం.. వాస్త‌వాల‌ను క‌ప్పి పుచ్చ‌డ‌మే. అసలైన దోషుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రక్షించేందుకు త‌న చేతిలో ద‌ర్యాప్తు  సంస్థ‌కు ఈ కేసును అప్ప‌గించి పెద్ద త‌ప్పును చిన్న‌త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని జ‌గ‌న్ లేఖ ద్వారా పేర్కొన్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్ ట‌న్నుల ఖ‌నిజాన్ని దోపిడీ చేశార‌ని తెలుపుతోంది. 
 
ప్ర‌తీ రోజు కొన్ని వేల లారీల‌ను ఉప‌యోగించి ఖ‌నిజాన్ని త‌ర‌లించేశారు. ఇంత వ్య‌వ‌హారం న‌డుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విష‌యం ఎవ‌రికి తెలియ‌ద‌ని అనుకోవాలా !... ఎమ్మెల్యే నుంచి చిన‌బాబు, పెద‌బాబు వ‌ర‌కు ఈ దోపిడీలో భాగ‌స్వాములు కాకుంటే ఇది జ‌రిగేదా..! రాష్ట్రంలో జ‌రిగే అనేక దోపిడీల్లో ఇదొక దోపిడీ మాత్ర‌మే. ఇసుక ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెడితే ఏ స‌హ‌జ వ‌న‌రుల‌ను మిగల్చ‌లేదు. 
 
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న చేతిలో సీఐడితో ఉన్న విచార‌ణ చేస్తే ఏం జ‌రుగుతుంది. తెలంగాణ‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేను న‌ల్ల ధ‌నంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల‌తో దొరికి పోయిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్న మాట‌ను గుర్తుకు త