సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys-jagan-mohan-reddy
Updated:  2018-02-25 12:53:09

సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు

సినీ న‌టి శ్రీదేవి అకాల మ‌ర‌ణంతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది.. న‌టి శ్రీదేవి మృతి ప‌ట్ల వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.. ఆమె మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అన్నారు వైయ‌స్ జ‌గ‌న్.
 
శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నటన, ఛరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నన‌టి ఆమె అని అన్నారు జ‌గ‌న్.. దక్షిణ భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ ఆమె అనేక సినిమాల్లో  నటించి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు అని .ఆమె సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అనేక  పాత్రలేన్నో ఆమె పోషించి మెప్పించారు. ఇంగ్లీష్‌ వింగ్లీష్‌లో గృహిణి పాత్ర శ్రీదేవి ఎంతటి అసమాన నటి అన్న విషయం తెలియజేసింది.
 
ఆ లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా  అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.