టీడీపీకి జ‌గ‌న్ కౌంట‌ర్ ట్వీట్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and ys jagan mohan reddy image
Updated:  2018-03-16 12:35:40

టీడీపీకి జ‌గ‌న్ కౌంట‌ర్ ట్వీట్ ?

ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం వైసీపీ నాలుగు సంవ‌త్స‌రాలుగా అలుపెరుగ‌ని పోరాటం చేస్తోంది..  అయితే ఇక ప్ర‌త్యేక హూదా పోరాటంలో భాగంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని భావించారు. వైసీపీ అవిశ్వాసం పై తెలుగుదేశం పార్టీ దిగివ‌చ్చింది అని అన్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. 
 
ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్... త‌ప్ప‌ని ప‌రిస్దితుల్లో వైసీపీని తెలుగుదేశం ఫాలో అవుతోంది అని అన్నారు  జ‌గ‌న్మోహ‌న్  రెడ్డి... ప్ర‌జ‌ల ప‌క్షాన వైసీపీ ఎప్పుడూ  ఉంటుంది అని అన్నారు..ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ప్రజాస్వామ్యం సాధించిన విజయం అని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులకోసం పోరాటం చేయడంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని స్పష్టం చేశారు.
 
ప్ర‌జా ప్ర‌యోజ‌నాల కోసం వైసీపీ ఇప్ప‌టికే అనేక సార్లు ప్ర‌త్యేక హూదా కోసం అనేక ఉద్యమాలు చేసింది.. అలాగే ప్ర‌త్యేక హూదా కోసం ప్ర‌జ‌లతో క‌లిసి వైసీపీ ముందుకు నడుస్తోంది అని అన్నారు  వైసీపీ నాయ‌కులు. ఇక జ‌గ‌న్ ట్వీట్ తో తెలుగుదేశం డైల‌మాలో ప‌డింది.. నిన్న‌నే వైసీపికి జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇవ్వాలి అని తెలుగుదేశం ఆలోచించింది.
 
ఒక‌వేళ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇస్తే  నిజంగా  ప్ర‌జ‌లు అంద‌రూ అర్ధం చేసుకుంటారు జ‌గ‌న్ వ‌ల్లే తెలుగుదేశం వైసీపీకి స‌పోర్ట్ చేసింది అని . జ‌గ‌న్ కు స‌పోర్ట్  ఇవ్వ‌కుండా వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ప్ర‌త్యేకహూదా పోరాటంతో త‌మకు క్రెడిట్ ఉండేలా చంద్ర‌బాబు పొలిటిబ్యూరోలో నిర్ణ‌యించి, ఎన్డీయేతో బ‌య‌ట‌కు వ‌చ్చి, అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు.. అయితే కేవ‌లం తెలుగుదేశం  బీజేపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాల‌ను స్పీక‌ర్ చ‌దివి ప‌క్క‌న పెట్టేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.