ఇది చ‌దివితే ప్ర‌తీ ఒక్క‌రు ఫిదా....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-19 13:35:30

ఇది చ‌దివితే ప్ర‌తీ ఒక్క‌రు ఫిదా....

అలుపెరుగ‌ని జ‌న‌నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభిమానుల‌కు ఒక పెద్ద గుడ్ న్యూస్... రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ ఆశ‌మేర‌కు రానున్న ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌ట‌... ఈ విష‌యాన్ని సాక్షాత్తు వేదపండితులు చెప్పారు... అంతేకాదు వారు చెప్పింది జ‌ర‌గ‌క‌పోతే తాము జీవితాంతం యాగం చేయ‌డం మానేస్తామ‌ని స్పష్టం చేశారు...
 
కానీ జగన్ జాతకంలో కొన్ని గోచార సమస్యలు ఉన్నాయి.. జగన్ మోహన్ రెడ్డి జాతకం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్‌ 25 తర్వాత ఈ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి... 2019 ఎన్నికలకు ముందే బుధ మహాదశ ప్రారంభమవుతుంది. దీంతో ఆయన కీర్తి మరింత పెరుగుతుంది.. దానితో పాటు ఆయన రాజశేఖర్ రెడ్డిలా పరిణితి చెందుతారని పంచాంగకర్తలు భవిష్యవాణి వినిపించారు...
 
మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందించిన సుపరిపాలన ఎంతో దూరంలో లేదని, ప్రజల ఇష్టంతోనే 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని...వైసీపీ సుమారు 135 అసెంబ్లీ సీట్లకి పైగా గెలవడం ఖాయమని పంచాంగ కర్తలు చెప్పారు... 2019 మే నెలలో జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లాలో ప్రముఖ పంచాంగకర్త శ్రీరామకృష్ణ శర్మ, నల్లపెద్ది ప్రసాదశివరామశర్మ తమ బృందంతో పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు.
 
40 మంది పంచాంగకర్తలం కూర్చుని భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేసి, ఒక ఏకాభిప్రాయానికి వచ్చామని, మేము చెప్పింది జరగకపోతే జీవితంలో పంచాంగ శ్రవణం చేయమని చెప్పారు...రాష్ట్రానికి, జగన్ కి మంచి జరగాలనే ఉద్దేశంతో సుమారు రెండేళ్ల పాటు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తామని జగన్ ముఖ్యమంత్రి హోదాలో పూర్ణాహుతి కోసం వస్తారని పంచాంగ శ్రవణం సందర్భంగా వేద పండితులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.