175అసెంబ్లీ ఇంచార్జ్ ల‌తో 25 పార్ల‌మెంట్ ఇంచార్జ్ లోత జ‌గ‌న్ కీల‌క స‌మావేశం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-09-07 04:28:37

175అసెంబ్లీ ఇంచార్జ్ ల‌తో 25 పార్ల‌మెంట్ ఇంచార్జ్ లోత జ‌గ‌న్ కీల‌క స‌మావేశం

ప్ర‌తిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ నెల 11న‌ పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌తో స‌మావేశం జ‌రుగ‌నుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్ల‌డుతూ,  11వ తేదిన విశాఖ జిల్లాలోని విశాఖ ఫంక్ష‌న్ హాల్లో ఉద‌యం 11 గంట‌లకు స‌మావేశం ప్రారంభం అవుతుంద‌ని అన్నారు. 
 
ఈ స‌మావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది అసెంబ్లీ స‌మ‌న్వ‌య క‌ర్త‌లు, అలాగే 25 మంది పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌లు, అలాగే పార్టీ ప్రాంతీయ కో- ఆర్డినేట‌ర్లు, పార్ల‌మెంట్ స‌భ్యులు, మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంద‌రూ పాల్గొంటార‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు.
 
ఈ స‌మమావేశం చాలా కీల‌క‌మైన స‌మావేశంగా తాము భావిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ స‌మావేశంలో పార్టీకి సంబంధించిన కార్య‌చ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నార‌ని తెలిపారు. అలాగే ప‌లు కీల‌క‌మైన నిర్ణ‌యాల‌ను కూడా తీసుకుంటామ‌ని అంబ‌టి స్ప‌ష్టం చేశారు.