అదిరిపోయే హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan padayatra speech
Updated:  2018-05-19 18:22:54

అదిరిపోయే హామీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ఈ సంక‌ల్ప‌యాత్ర కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కంచుకోట కృష్ణా జిల్లాను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గోపాలపురం శివారులో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఇక ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్  తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అధికార అండ చూసుకుని అమ‌రావ‌తి భూముల నుంచి మ‌ట్టి వ‌ర‌కూ అక్ర‌మంగా ఎలా  దోచుకుంటున్నారో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ఈ సంక‌ల్ప‌యాత్రలో భాగంగా జగన్‌ శనివారం ప్రకాశరావుపాలెంలో గిరిజనులతో సమావేశం అయ్యారు.  ఈ స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల ప‌రిపాల‌న‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గిరిజ‌నుల‌కు చేసింది ఏం లేద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి ఒక్క హామీను కూడా స‌క్ర‌మంగా అమ‌లు ప‌ర‌చ‌లేద‌ని జ‌గ‌ర్ మండిప‌డ్డారు.  
 
దీంతోపాటు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక గిరిజ‌నుల‌కు ఒక్క ఇల్లు కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు. గ‌తంలో వైయ‌స్సార్ హాయాంలో గిరిజ‌నుల‌కు  13 ల‌క్ష‌ల ఎకరాల‌ను పంపిణి చేశార‌ని అయితే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యాక గిరిజ‌నుల‌పై ఉక్కుపాదం మోపుతున్నార‌ని విమ‌ర్శించారు. ఇక‌ ఇప్పుడు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న తురుణంలో చంద్ర‌బాబు కొత్త డ్రామాల‌కు తెర‌లేపార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్.
 
అయితే తాము 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక గిరిజ‌నుల‌కు పావ‌లా వ‌డ్డీకే రుణాల‌ను ఇస్తామ‌ని, ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అలాగే గిరిజన మహిళలకు 45 ఏళ్లకే రూ. 2 వేలు పెన్షన్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతోపాటు దీర్ఘకాలిక రోగాలతో బాధ పడే గిరిజ‌నుల‌కు నెలకు రూ. 10వేల పెన్షన్ కేటాయిస్తామ‌ని జ‌గ‌న్ అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.