ద‌ర్శిలో జ‌గ‌న్ వ్యూహం ఫ‌లించింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy and buchepalli siva prasad reddy image
Updated:  2018-03-10 01:13:59

ద‌ర్శిలో జ‌గ‌న్ వ్యూహం ఫ‌లించింది

ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ లో ఏర్ప‌డిన విభేదాలు స‌మస్య‌లు కాస్త స‌మిసిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నాయి.. అక్క‌డ అసంతృప్తితో ర‌గిలిపోతున్న మాజీ శాస‌న‌స‌భ్యుడు బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి జ‌గ‌న్ జోక్యంతో శాంతించారు.. వైయ‌స్ కుటుంబాన్ని తాము  ఏనాడు ఎదిరించ‌లేద‌ని మాకు వైయ‌స్ కుటుంబం పై మంచి అభిప్రాయం ఉంది అని అన్నారు శివ‌ప్ర‌సాద్ రెడ్డి.. అదే విధేయత  వైయ‌స్ కుటుంబం పై  చూపుతున్నారు బూచేప‌ల్లి.
 
ఇటీవ‌ల  జగన్‌తో జరిగిన భేటీ ఫలించినట్లయింది. అయితే ఈ సమావేశంలో జగన్‌ ఏవైనా హామీలు ఇచ్చారా? లేక ఆయన మాటను గౌరవించి బూచేపల్లి భేషరతుగానే తన అసంతృప్తిని వీడారా? అన్నది వెల్లడించ‌లేదు. ప్రస్తుతానికి దర్శి నుంచి జగన్‌ ప్రకటించిన బాదం మాధవ రెడ్డి అభ్యర్థిత్వానికి బూచేపల్లి పచ్చ జెండా ఊపినట్లు అక్క‌డ నాయ‌కులు తెలియ‌చేస్తున్నారు. ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తాను అని జ‌గ‌న్ కు బూచేప‌ల్లి మాట ఇచ్చార‌ట‌.
 
జ‌గ‌న్ తో భేటీ త‌ర్వాత త‌న‌కు వైయ‌స్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని తెలియ‌చేశారు. ఇక త‌న అనుచ‌రులు ఎక్కువ మంది మీరు అభ్య‌ర్దిగా ఉండాలి అని కోర‌డంతో జ‌గ‌న్ మాట తాను జ‌వ‌దాట‌ను అని తెలియ‌చేశారు.. ఈ సారి బాధం మాధ‌వ రెడ్డికి స‌పోర్ట్ చేస్తాను అని శివ‌ప్ర‌సాద్ రెడ్డి తెలియ‌చేశారు.
 
2004లో తన తండ్రి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా రాజశేఖర్‌రెడ్డికి ముందుగా చెప్పామని తదనుగుణంగా గెలవగానే పార్టీలోకి తీసుకున్నారన్నారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య అనుబంధం పెరిగిందన్నారు అలాగే గ‌తంలో రామ తీర్థం జలాశయం వద్ద జరిగిన ఒక సభలో తనను చూసిన వై.ఎస్‌. 2009లో సీటు ఇచ్చారన్నారు. ఆయన మృతి చెందిన త‌ర్వాత  జగన్‌ కోసం అధికారాన్ని కూడా కాదని వైసీపీలో చేరినట్లు చెప్పారు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ వెంటే ఉన్నాను అన్నారు... ఆయ‌న సీఎం అవ్వాల‌నేది, నా ఆకాంక్ష , త‌న‌కు పార్టీలో స‌ముచిత స్ధానం జ‌గ‌న్  ఇస్తారు అనే న‌మ్మ‌కం ఉంది అని ఆయ‌న తెలియ‌చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.