జ‌గ‌న్ వ్యూహానికి అంత క్రేజా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan politics
Updated:  2018-03-23 03:21:41

జ‌గ‌న్ వ్యూహానికి అంత క్రేజా

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌ల‌ త‌రుపున‌ పోరాటం చేస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే... అయితే ప్ర‌ధానంగా రాష్ట్రం అభివృద్ది చెంద‌డానికి ప్ర‌త్యేక హోదా అత్య‌వ‌స‌రం.. దీని కోసం మొద‌టి నుంచి కేంద్ర‌ప్ర‌భుత్వానికి  వ్య‌తిరేకంగా వైయ‌స్ జ‌గ‌న్‌ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు జాతీయ స్థాయిలో ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.
 
కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా 16 మంది ఎంపీలు ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను, ప్ర‌త్యేక‌హోదా సాధించుకోవ‌డంలోను, కేంద్రం పై  పోరాటం చేయ‌డంలోనూ ఘోరంగా వైఫ‌ల్యం చెందింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్ర‌త్యేక‌హోదా పై రోజుకో మాట మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో టీడీపీకి ఉన్న‌టువంటి విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోయింది.
 
అధికారం లేక‌పోయిన ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటూ ప్ర‌త్యేక‌హోదా సాధ‌న‌కై పోరాడుతూ, చివ‌రికి కేంద్రం పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశపెట్టింది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్ప‌టికి కూడా స్పందించ‌క పోతే పార్ల‌మెంట్ చివ‌రి రోజున వైసీపీ ఎంపీల‌తో రాజీనామా చేయిస్తాన‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికి తెలిసిందే.... ఈ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్  ను చూసి జాతీయ స్థాయిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి.
 
కేవ‌లం ఐదుగురు ఎంపీల‌తో కేంద్రానికి స‌వాల్ విసురుతున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికార తెలుగుదేశం పార్టీకి ఉన్న 16 మంది ఎంపీలు వైసీపీకి ఉండి ఉంటే జ‌గ‌న్ ఇప్ప‌టికే కేంద్రం నుంచి విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను, ప్ర‌త్యేక‌హోదాను సాధించి ఉండే వార‌ని జాతీయ స్థాయిలో ఉన్న రాజ‌కీయ ముఖ్య నేత‌లు, ప్ర‌ముఖులు అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.