ప్ర‌జానేత‌ పాద‌యాత్ర @ 1500

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy prajasankalpa yatra image
Updated:  2018-03-14 04:12:32

ప్ర‌జానేత‌ పాద‌యాత్ర @ 1500

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా  బ్మ‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. ఇక ఈ యాత్ర నిర్విరామంగా గుంటూరు జిల్లా పొన్నూరు సెగ్మెంట్ లో కొన‌సాగుతోంది... అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కుల‌కు గుంటూరు జిల్లా కంచుకోట‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే ... అయితే ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న సంక‌ల్ప యాత్రతో టీడీపీ కంచుకోట‌కు చేరుకోవ‌డంతో అక్క‌డి ప‌రిస్థితి పూర్తిగా తారుమారు అయింది.
 
దీంతో పాటు ఈ యాత్ర మ‌రో మైలు రాయి దాటింది... పొన్నూరు సెగ్మెంట్ ములుకుదురు వద్ద వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సంద‌ర్బంలో  ఆయన ములుకుదురులో ఒక‌ మొక్కను నాటారు.ఈ 1500 కిలోమీటర్ల దారిలో  నియోజకవర్గాలు, ఊళ్లు,  ప్రజల సమస్యల‌ను సహనంతో  తెలుసుకుంటూ వారికి భరోసాని ఇస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
@ జ‌గ‌న్ పాద‌యాత్ర మైలురాళ్లు @
 
0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబరు 6, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబరు 14, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబరు 22, 2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబరు 29, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబరు 16, 2017)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబరు ‌24, 2017)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, కొరిమెర్ల (ఫిబ్రవరి 7, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1400​‍ - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.