ఈ రోజు జ‌గ‌న్ అక్క‌డ టీడీపీని దుమ్ము దులిపేస్తారు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-07 18:51:02

ఈ రోజు జ‌గ‌న్ అక్క‌డ టీడీపీని దుమ్ము దులిపేస్తారు

ఏపీ ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంకల్ప‌యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లా రామ‌చంద్ర‌పురం నియోక‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ఆప‌ద‌లో ఉన్న వారికి కొండంత భ‌రోసా ఇస్తూ త్వ‌ర‌లో ప్ర‌తీ ఒక్క‌రి ముఖంలో చిరున‌వ్వు నింపుతాన‌ని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
 
అంతే కాదు వైసీపీ నాయ‌కులు భ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేసిన‌ప్పుడు అధికార బ‌లంతో తెలుగు దేశంపార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ 2019లో వైసీపీ అధికారంలోకి అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు జ‌గ‌న్. ఇక ఈ రోజు ఉద‌యం పాదయాత్ర  జగన్నాయకులపాలెం గ్రామాల్లో స్టార్ట్ అయ్యి చిన్నతాళ్ళపొలం, పెద్దతాళ్ళపొలం, వెల్ల క్రాస్‌ మీదుగా రామచంద్రాపురం పట్టణంలోకి జ‌గ‌న్ చేరుకుంటారు. అక్క‌డ వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొంటారు. 
 
ఈ స‌భ‌లో మ‌రోరిసా ఏపీ ముఖ్యంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌నపై అలాగే రామచంద్రాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ గొంతు విప్ప‌నున్నారు. ఇక ఆయ‌న స్పీచ్ ను వినేందుకు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఇత‌ర ప్రాంతాల నుంచి వారు అయితే అక్క‌డి ఉండి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూసి ఆయ‌న మాట‌లు విందామ‌ని ఎంతో ఆశ‌గా ఉన్నారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.