బాబు రెండు వేళ్లు అందుకే చూపుతార‌ట

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 15:33:29

బాబు రెండు వేళ్లు అందుకే చూపుతార‌ట

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ  కంచుకోట అయిన కృష్ణా జిల్లా మైలవరంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్... ఈ  జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 270 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేయనున్నారు.
 
అయితే ఈ పాద‌యాత్ర‌లో భాగంగా మైల‌వ‌రంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడుపై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌న్.. త‌మ పార్టీ ఎంపీలు రాష్ట్ర సంజీవని అయిన ప్ర‌త్యేక‌ హోదాను డిమాండ్ చేస్తూ ప్రాణాలు సైతం లెక్క‌చేయ‌కుండా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష‌లు చేస్తే చంద్ర‌బాబు నాయుడు వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా డ్రామాలు ఆడుతున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.
 
వైసీపీ ఎంపీల‌తో పాటు చంద్ర‌బాబు త‌న పార్టీ ఎంపీల‌తో రాజీనామా చేయించి పార్ల‌మెంట్ లో నిర‌స‌న‌లు చేయించి ఉంటే దేశ మంతా మ‌న వైపు చూసేద‌ని అన్నారు... ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజునాడు  ఒక రోజు నిరాహార దీక్ష చేస్తా అనే నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు జ‌గ‌న్.. ఆయ‌న పుట్టిన రోజు నాలుగో నెల 20వ తేది అని, ఈ రెండు క‌లిపితే 420 అవుతోందని ఈ 420 ఒక రోజు నిరాహార దీక్ష‌ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్.. పార్ల‌మెంట్ స‌మావేశాలు చివ‌రి రోజున స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జ‌న్ స‌భ‌ను వాయిదా వేసినప్పుడు  టీడీపీ ఎంపీలతో రాజీనామాలు, నిరాహార దీక్ష చేయించని చంద్రబాబు ఆ రోజు 420  కొంగజపం చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.
 
అలాగే చంద్ర‌బాబు పాల‌న చాలా దారుణంగా త‌యారు అయింద‌ని ఈయ‌న హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు జ‌గ‌న్ . దివంగ‌త‌నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో ప్ర‌తీ మండలానికి ఒక అంబులెన్స్‌ ఉండేదని కానీ, ఇప్పుడు నియోజకవర్గానికి రెండు అంబులెన్స్‌లు మాత్రమే ఉన్నాయని అన్నారు... అంబులెన్సుల సిబ్బందికి కూడా గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు.
 
2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు సుమారు ఆరువంద‌ల‌కు పై త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారాన్ని ద‌క్కించుకున్నార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్... ముఖ్య‌మంత్రి ప్రక‌టించిన‌ ఈ ఆరువంద‌ల హామీల్లో ఒక్క‌టైనా స‌రిగ్గా ప్ర‌జ‌ల‌కు అమ‌లుప‌రిచారా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు..  దీంపాటు ప్ర‌తీ ఇంటికి ఒక ఉద్యోగం అలాగే ప్ర‌తీ నిరుద్యోగికి నెల‌కు రెండు వేలు రూపాయలు ఇస్తాన‌ని చేప్పి చంద్ర‌బాబు మోసం చేశార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.
 
ప్ర‌తీ నెలకు రెండువేలు చొప్పున దానిని నాలుగు సంవంత్స‌రాలు కూడితే సుమారు 96,000 రుపాయ‌లు ప్ర‌తీ నిరుద్యోగికి చంద్ర‌బాబు అప్పు ఉన్నార‌ని అన్నారు.. ఇలాంటి త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారాన్ని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు నాయుడిని హిమాల‌యాల్లో తోసేయ్యాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు జ‌గ‌న్.. అలాగే చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో తన రెండువేళ్లు ఎందుకు చూపిస్తారో తెలుసా..? అని ప్ర‌జ‌ల‌కు అడిగారు జ‌గ‌న్.. ఆ రెండువేళ్లు ప్ర‌తీ నిరుద్యోగికి రెండు వేలు ఇవ్వ‌ను...ఇవ్వ‌ను అని తెలుప‌డానికని ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.
 
వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌తీ ఇంటికి కిలో బంగారం, ఒక బెంజ్ కారు ప్ర‌తీ ఓట‌రుకు రెండువేలు ఇస్తాన‌ని ప్ర‌చారం చేస్తార‌ని, అయితే మాకు రెండువేలు కాదు ఐదువేలు  కావాల‌ని చంద్ర‌బాబుని అడ‌గండ‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు జ‌గ‌న్... ఆయ‌న పంచే ఈ డ‌బ్బంతా మ‌న‌దేన‌ని తెలిపారు.. కానీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర డ‌బ్బుతీసుకుని  మీ మ‌న‌స్సాక్షికి  చెప్పిన వారికి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.