షాక్ ఇవ్వ‌నున్న జ‌గ‌న్ నిర్ణయం..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-27 17:40:10

షాక్ ఇవ్వ‌నున్న జ‌గ‌న్ నిర్ణయం..?

ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి గ‌తంలో నీ వాటా ఎంత నా వాటా ఎంత అని ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డికి నాకు వివాదాలు లేకుండా స‌యోధ్య సీఎం చేశారు  అని ఓ స‌భ‌లో తెలియ‌చేశారు.. ఇక అలాగే అర్ధ‌రూపాయి వాటాల గురించి ఆ వీడియోలో పూస‌గుచ్చిన‌ట్లు తెలియ‌చేశారు స‌ద‌రు ఫిరాయింపు మంత్రి.... ఇక వైసీపీ ఎమ్మెల్యేల‌ను తెలుగుదేశం ఎటువంటి హామీలు ఇచ్చి ప్ర‌లోభాలు గురిచేసిందో ఇదే ఓ సాక్ష్యం అని  అప్ప‌టి నుంచి వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది.
 
ఇక వైసీపీ ఎమ్మెల్యేల‌ను  తెలుగుదేశం పార్టీ తీసుకుని మంత్రి ప‌దవులు ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ నిల‌దీస్తూ ప్ర‌శ్నిస్తూ రాజీనామాలు చేయాల‌ని నిల‌దీస్తూనే ఉన్నారు ప్ర‌తిప‌క్షనేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి....అయితే  జ‌గ‌న్ మాటని ఎక్క‌డా లెక్క‌చేయ‌లేదు తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు, ఫిరాయింపు నేత‌లు... బ‌హుశా వారిచేత రాజీనామా చేయిస్తే వారు విజ‌యం సాధిస్తారో లేదో తెలియదు..... ఉప ఎన్నిక‌లు వ‌స్తే ఓడిపోతే ఆ దెబ్బ మ‌రింత దారుణంగా ఉంటుంది అని వారి వాద‌న‌. ఇక స్ధానిక సంస్ద‌ల ఎన్నిక‌లు ముందుకు వెళితే ఓ బాధ వెన‌క్కి త‌గ్గితే మ‌రో బాధ అందుకే ఆలోచ‌న‌లో ఉన్నారు త‌మ్ముళ్లు.
 
ఇక ప్ర‌త్యేక హూదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల చేత రాజీనామా చేయించి ప్ర‌త్యేక‌హూదా ఉద్య‌మం చేశారు.. హ‌స్తిన‌లో ఆరు రోజులు నిరాహారదీక్ష చేశారు.. దానిని వెట‌క‌రించిన సీఎం చంద్ర‌బాబు ధ‌ర్మ‌పోరాట దీక్ష అని చెప్పి, భోజ‌నం తింటే 500 ఖ‌ర్చు అయ్యేది... భోజ‌నం చేయ‌కుండా 12 గంట‌లు దీక్ష చేసి 30 కోట్లు ఖ‌జానాకు చిల్లు పెట్టారు అనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
ఇక ఇప్పుడు జ‌గ‌న్ మ‌రో కొత్త ప్లాన్ వేస్తున్నారు అని తెలుస్తోంది.. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాలు నిర‌స‌న‌లు అంద‌రూ చూసిన‌వే.. ఇక ఎమ్మెల్యేలు సైకిల్ యాత్ర‌లు అంటూ రోజూ సైకిల్ తోక్కుతున్నారు.. చెవులో పువ్వులు పెట్టుకోవ‌డం, నిర‌స‌న‌లు కొర‌డాలతో కొట్టుకోవ‌డం మౌన‌పోరాటం ఇలా న‌ల్ల బ్యాడ్జీలు క‌ట్టుకోవ‌డం చేస్తూనే ఉన్నారు. ఇక ఇవ‌న్నీ స్దానిక మీడియాల్లో వ‌స్తున్నాయి కాని నేష‌న‌ల్ మీడియాలో రావ‌డం లేదు. ఇక కేంద్రం మెడ‌లు ఎలా వంచుతారు అని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు.
 
ఈ విధ‌మైన నిర‌స‌న‌లు చేస్తే ప్ర‌త్యేకహూదా వ‌స్తుందో రాదో చిన్న పిల్ల‌వాడికి అయినా తెలుసు అనేది మేధావుల వాద‌న‌.. ఇక జ‌గ‌న్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారు అని తెలుస్తోంది... త‌న‌తో స‌హా వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి అని అనుకుంటున్నార‌ట .జ‌గ‌న్ . ఈ నిర‌స‌న‌లు హూదా ఉద్య‌మాల‌తో ఎటుంటి పోరాటాలు చేసినా కేంద్రం దిగిరావ‌డం లేద‌ని అందుకే నేష‌న‌ల్ వైడ్ అంద‌రి నుంచి క‌చ్చితంగా గుర్తింపు వ‌స్తుంద‌ని కేంద్రం పై ప్రెజ‌ర్ పెరుగుతుంది అని వైసీపీ భావిస్తోంది... ఈనిర్ణ‌యం జ‌గ‌న్ తీసుకుంటే ఇది ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌న‌మే అని చెప్ప‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.