నేను చేసిన గొప్ప పని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 05:31:14

నేను చేసిన గొప్ప పని

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కలిచేడులో చేనేతన్నలతో వైయస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ నవరత్నాలను వారికి వివరించడంతో పాటు అక్కడికి వచ్చిన చేనేతన్నల సమస్యలను విని తెలుసుకున్నారు. ముఖాముఖిలో భాగంగా వెంకట కృష్ణ అనే చేనేత కార్మికుడు..... తమ తరపున చట్టసభల్లో సమస్యలను వినిపించేందుకు ఓ వ్యక్తి కావాలి.. కావున చేనేత వర్గానికి చెందిన వారిని చట్టసభలకు వెళ్లేందుకు వైసీపీ అవకాశం కల్పించాలని కోరారు.

అందుకు వైయస్ జగన్ సమాధానమిస్తూ....మీ తరపున నేను చేసిన గొప్ప పని ఏంటో తెలుసా... బుట్టా రేణుక అని కర్నూలు ఎంపీ చేనేత వర్గానికి చెందిన ఆడపడుచుకు టికెట్టు ఇచ్చిన గెలిపించుకున్నామని గుర్తు చేశారు. పదవులకు సంబంధించి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. చేనేతలకు కార్పోరేషన్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. కాగా వైసీపీ నుండి గెలిచిన బుట్టా రేణుక ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.