జై కొడుతున్న జ‌నాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 18:35:12

జై కొడుతున్న జ‌నాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది ప్రతిపక్ష పార్టీనా..? లేక అధికార పార్టీనా? ఎక్క‌డైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఈ సమస్యను తెలుసుకొని, పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి...పరిపాలన ఏ రాష్ట్రంలోనైనా ఇలాగే ఉంటుంది... కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది... అధికార పార్టీ చేయాల్సిన పనులు ప్రతిపక్ష పార్టీ చేస్తోంది... ప్రతిపక్ష పార్టీ ఏం చేసింది అని అనుకుంటున్నారా? అయితే ఈ మధ్య కాలంలో ఏపీలో జరిగిన కొన్ని సంఘటనలను మనం తెలుసుకోవాల్సిందే.
 
విభజించబడిన రాష్ట్రం కావడంతో రాష్ట్ర స్థితిగతులను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది...ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితులలో లోటు బడ్జెట్ ని అధిగమించాలంటే మనకు ఉన్న ఏకైక ఆయుధం ప్రత్యేక హోదా... రాష్ట్రానికి సంజీవని...ఈ సంజీవని కోసం ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడవచ్చు, కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం వేరే విధంగా ఉన్నాయి.
 
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వాళ్ళను ఉక్కుపాదంతో అణగదొక్కాలని చూస్తోంది టీడీపీ ప్రభుత్వం...కానీ రాష్ట్ర స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రతిపక్ష పార్టీ అధినేత‌ జగన్ మోహన్ రెడ్డి, హోదా వస్తేనే  రాష్ట్ర ప్రజలు తలరాతలు మార‌తాయ‌ని గ్రహించి, ఎన్ని సమస్యలు వచ్చినా  నాలుగేళ్లుగా కేంద్రంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు జ‌గ‌న్. వాస్త‌వంగా చెప్పాలంటే టీడీపీ  ప్రభుత్వం చేయాల్సిన పోరాటాన్ని, ప్రతిపక్ష వైసీపీ  చేస్తోంది... ఇక మొదటి నుండి ప్రత్యేక హోదాపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే అధికార పార్టీ పాత్రను ప్రతిపక్ష పార్టీ పోషిస్తోందని రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు.
 
ఇక ఇదే క్ర‌మంలో ఏపీ లో జరిగిన మరో ఘటనను చూస్తే... ప‌శ్చిమ‌ గోదావరి జిల్లాలోని గరగపర్రులో దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు...అక్కడ అంత జరుగుతున్నా ఏదైనా తేడా జరిగితే ఓట్లు పోతాయని భ‌యపడి అధికార పార్టీ ప్రేక్షక పాత్ర పోషించింది.
 
ఇక అధికార పార్టీ చేయాల్సిన పనిని ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి కొన్ని గంటలలోనే చేసి చూపించారు... ఒకసారి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న, గరగపర్రులో ఏదైనా తేడా జరిగితే రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న దళితుల ఓట్లన్నీ పోయి మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశం ఉన్నా కుడా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని భావించి, ధైర్యంగా గరగపర్రుకు వెళ్లి వారితో మాట్లాడి, వాళ్ళ సమస్యను పరిష్కరించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
 
ఇలాంటి ఎన్నో సంఘటనలలో అధికార పార్టీ చేయాల్సిన పనిని ప్రతిపక్షం చేసి చూపించింది...అందుకే రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ప్రతిపక్ష పార్టీనా అని అంటున్నారు...టీడీపీ కేవలం ఓట్ల రాజకీయాలే తప్ప, ప్రజల సమస్యలు  ప‌ట్టించుకోద‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.