నేష‌న‌ల్ మీడియాలో జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 14:56:53

నేష‌న‌ల్ మీడియాలో జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది..ఈ సంక‌ల్ప‌యాత్రకు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్  ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు... ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఏపీ ముఖ్య‌మంత్రి  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు రాష్ట్ర సంజీవని అయిన ప్ర‌త్యేక హోదాపై కొంచెం కూడా చిత్తశుద్ది లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.. ఒక వేళ ఆయ‌న‌కు కొంచెం అయినా చిత్త‌శుద్ది ఉంటే త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి వైసీపీ ఎంపీల‌తో పాటు ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష చేయించి ఉండేవార‌ని  జ‌గ‌న్ మండిప‌డ్డారు.. వైసీపీ ఎంపీల రాజీనామాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని, ఈ దీక్ష ద్వారా చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్ అన్నారు.
 
పార్ల‌మెంట్ స‌మావేశాల చివ‌రి రోజున స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జ‌న్ స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన‌ప్పుడు చంద్ర‌బాబు త‌మ ఎంపీల‌తో  రాజీనామా చేయించి ఉంటే రాష్ట్రానికి ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని అన్నారు జ‌గ‌న్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25మంది ఎంపీలు ఏక‌దాటిగా  రాజీనామా చేసి ఉంటే హోదాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని ఆయన తెలిపారు... అలాగే టీడీపీ ఎంపీల‌తో రాజీనామా చేయించ‌లేని చంద్ర‌బాబు తన జ‌న్మ‌దినం రోజున ఎవ‌రికోసం నిరాహార దీక్ష‌చేస్తున్నారో త‌న‌కు వివ‌రించాల‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.