జగన్‌ ట్వీట్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-09 17:05:28

జగన్‌ ట్వీట్‌

ప్ర‌త్యేక హూదా కోసం వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష‌కు ప‌లు పార్టీలు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి.. మ‌రీ ముఖ్యంగా వైయ‌స్సార్ సీపీ ఎంపీల‌కు ప‌లు జాతీయ పార్టీల నాయ‌కులు  మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.. ఇక తాజాగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హూదా పై  ట్వీట్ చేశారు.
 
!!ట్వీట్ !!
మా ఎంపీల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించారు. ప్రధాని మోదీగారు, ఎంపీల జీవితాలు, ఏపీ భవిష్యత్‌ ఆందోళనలో ఉన్నాయి. హోదాపై మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి.’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఉక్కు సంకల్పంతో ఈ నెల 6వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేప‌ట్టారు...ఈ  ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో  వైద్యుల సూచన మేరకు పోలీసులు వారిని  రామ్‌మనోహర్‌లోహియా ఆస్పత్రికి తరలించారు. 
 
మరోవైపు ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఇటు పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ కూడా ఇప్ప‌టికే పార్టీ త‌ర‌పున నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.. ఇటు ప‌లువురు ఎమ్మెల్యేలు వైసీపీ నాయ‌కులు రాజ్య‌స‌భ స‌భ్యులు వైసీపీ ఎంపీల వెంటే ఉన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.