జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-16 13:08:03

జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సోద‌రులంద‌రికీ రంజాన్ పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనద‌ని, మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించిందని ఈ రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని వైఎస్‌ జగన్‌ అన్నారు.
 
రంజాన్ అంటే కేవ‌లం ఉపవాస దీక్ష మాత్ర‌మే కాద‌ని మ‌నిషిలో ఉండే చెడును, ఆద‌ర్మాన్ని, ద్వేషాన్ని తొల‌గించే గొప్ప పండుగ‌ని జ‌గ‌న్ అన్నారు. అందుకే ఈ పండుగ చేసుకుంటున్న ముస్లిం సోద‌రులంద‌రికీ రంజాన్ శుభాకాంక్ష‌లు అని తెలిపారు.
 
jagan tweet
 
ఇక మ‌రోవైపు ఆయ‌న త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.