వైసీపీకి పెద్ద ప్ల‌స్సే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-22 18:42:59

వైసీపీకి పెద్ద ప్ల‌స్సే

2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి అత్య‌ధిక మెజార్టీతో గెలిచి అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.ఇక తాజాగా వైఎస్ జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ఫిరాయించిన ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాల్లో క్ర‌మ ప‌ద్ద‌తిలో ఆలోచించి 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేయించే అభ్య‌ర్థుల‌ను ప్ర‌కటిస్తూ వ‌స్తున్నారు జ‌గ‌న్.
 
ఈ క్ర‌మంలో పాతవారి స్థానంలో కొత్త వారికి, కొత్త వారి స్థానంలో పాత వారిని నియ‌మించేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌య్యార‌ట‌. ఇక వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచిప‌ట్టున్న‌ రాయ‌ల‌సీమ‌లో కూడా పార్టీ అధిష్టానం మార్పులు చేర్పులు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇలా మార్పులు చేయ‌డం వల్ల వైసీపీకి మంచి ఉప‌యోగం ఉంటుంద‌ని తాజాగా విశ్లేష‌కులు తెలుపుతున్నారు.
 
ఎందుకంటే కొత్త వారిని నియ‌మించ‌డం వ‌ల్ల సెగ్మెంట్ ల వారిగా వైసీపీ ఇంచార్జ్ లు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యక్షంగా తెలుసుకోగ‌లుగుతారని భావిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంత‌కు ముందు ఉన్న అభ్య‌ర్థులే ఆయా నియోజ‌కవ‌ర్గాల‌ నుంచి పోటీ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే వైసీపీ త‌ర‌పున ప‌త్తికొండ‌లో మంచిప‌ట్టు ఉన్న అభ్య‌ర్థి చెరుకులపాడు నారాయ‌ణ రెడ్డి.అయితే ఆయ‌న‌ను కొద్దిరోజుల క్రితం త‌న ప్ర‌త్య‌ర్థులు కాపు కాసి హత్య‌చేశారు.
 
దీంతో ఇక్క‌డ ఖాళీ గా ఉన్నస్థానాన్ని జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా నారాయ‌ణ రెడ్డి భార్య చెరుకుల‌పాడు శ్రీదేవిని ఇంచార్జ్ గా నియమించారు,ఈ క్ర‌మంలో ప‌త్తికొండ‌లో వైసీపీ పాగా వేయ‌డం ఖాయం.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.