జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-15 10:47:24

జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం

 ఇక ఏప్రియ‌ల్ ఐద‌వ తేదీన కేంద్రం చివ‌రి రోజు ఏపీకి ప్ర‌త్యేక హూదా పై ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే, త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు  రాజీనామాలు చేసి,  బ‌య‌ట‌కు వ‌స్తారు అని తెలియ‌చేశారు వైసీపీ అధినేత  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఇక తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో, ఇటు తెలుగుదేశం నాయ‌కులు డైల‌మాలో ప‌డ్డారు... అయితే ఏపీ భ‌విష్య‌త్తు కోసం ఎటువంటి వార్త‌లు ప్ర‌చారం చేయాలో తెలియ‌క ఆస్ధాన‌మీడియా కూడా లొసుగులు వెతుకుతోంది... జ‌గ‌న్ డెసిష‌న్ తో చ‌తికిల‌బ‌డిన నేత‌లు ఏకంగా ఉప ఎన్నిక‌ల కోసం చ‌ర్చించుకుంటున్నారు.
 
అయితే అమ‌రావ‌తి వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌త్యేక హూదా కోసం దీక్ష చేయ‌డానికి సిద్దం అవుతున్నారు అని తెలుస్తోంది.. అది ప్ర‌కాశం - కృష్ణా జిల్లాల పాద‌యాత్ర స‌మ‌యంలో దీక్ష చేయ‌డానికి జ‌గ‌న్ రెడీ అవుతున్నారు అని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.. అయితే దీనిపై తెలుగుదేశం నాయ‌కులు మాత్రం వైసీపీ అధినేత రాజ‌కీయంగా కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు అని స‌టైర్లు వేస్తున్నారు.. అయితే ఇటు పార్ల‌మెంట్  స‌మావేశాల స‌మ‌యంలో, ఇటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం హూదా కోసం దీక్ష చేయ‌డం అంటే అది పార్టీకి మ‌రింత ప్ల‌స్, అలాగే జ‌నాల్లో జ‌గ‌న్ కు మ‌రింత మైలేజ్ పెరుగుతుంది.
 
ఇప్పుడు తాజాగా మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది..  త‌మ ఎమ్మెల్యేల‌ను కూడా ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం రాజీనామా చేయించే యోచ‌న‌లో ఉన్నారు అని, జ‌గ‌న్ ఈ విధంగా కూడా కొత్త ఆలోచ‌న చేస్తున్నారు అని చ‌ర్చించుకుంటున్నారు అయితే, ఈ కార్యాచ‌ర‌ణ పై మ‌రిన్ని విష‌యాలు తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.